బ్రెడ్ ఢోక్ల సాన్డ్విచ్ | Bread Dhokla Sandwich Recipe in Telugu

ద్వారా Himabindu   |  13th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Bread Dhokla Sandwich by Himabindu at BetterButter
బ్రెడ్ ఢోక్ల సాన్డ్విచ్by Himabindu
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

3

0

బ్రెడ్ ఢోక్ల సాన్డ్విచ్ వంటకం

బ్రెడ్ ఢోక్ల సాన్డ్విచ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bread Dhokla Sandwich Recipe in Telugu )

 • 1 కప్ - శనగపిండి
 • 1 కప్ - బొంబాయి రవ్వ
 • 1 కప్ - పెరుగు
 • 4 - బ్రెడ్ స్లైసుల
 • 2 కప్స్ - క్యాప్సికం,బీన్స్,క్యారెట్ (ఈ మూడు కలిపి 2 కప్స్)
 • 1/2 కప్ - ఉల్లిపాయ
 • 5 చెంచాలు - నూనె
 • చిటికెడు పంచదార
 • ఉప్పు రుచికి సరిపడినంత
 • 1 చెంచా - కారం
 • 1 చెంచా - గరంమసాల
 • 1 చెంచా - టొమాటో కెచప్
 • 1 చెంచా - మిరియాల పొడి
 • 1 చెంచా - నిమ్మరసం
 • 2 చెంచా - కొతిమీర
 • 1 చెంచా - ఆవాలు
 • 2 పచ్చి మిర్చి
 • 8 రెమ్మలు కరివేపాకు

బ్రెడ్ ఢోక్ల సాన్డ్విచ్ | How to make Bread Dhokla Sandwich Recipe in Telugu

 1. మొదటగ శనగ పిండి,బొంబాయి రవ్వ,పెరుగు,ఉప్పు(రుచికి సరిపడినంత), పంచదార,1 చెంచా నూనె వేసి కలుపుకోవాలి.మరీ గట్టిగ కాకుండ మరీ జారుడుగ కాకుండ మధ్యస్తంగ కలుపుకోవాలి.పూర్నాలకి దోసపిండి కలుపుకున్నట్టు.అలా కలుపుకోని మూత పెట్టి పక్కన పెట్టండి.
 2. ఇప్పుడు క్యాప్సికం,క్యారెట్,బీన్స్,ఉల్లిపాయ సన్నగ చిన్న చిన్న ముక్కలుగ తరిగి పెట్టుకోవాలి(నేను మొక్కజొన్న, పచ్చిభఠాని ఫ్రోజన్ వి ఉపయోగించాను).క్యాప్సికం ఏదైన ఉపయోగించవచ్చు ఎరుపు,ఆకుపచ్చ,పసుపు రంగులు అందుబాటులొ ఉంటె వాడుకోవచ్చు.
 3. స్టవ్ వెలిగించి కడాయు పెట్టి 3 చెంచాలు నూనె వేసి నూనె వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న బీన్స్,క్యారెట్ వెసి 5 నిమిషాలు మగ్గనివ్వండి తరువాత ఉల్లిపాయ,క్యాప్సికం వేసి 3 నిమిషాలు మగ్గనివ్వండి (చిటికెడు ఉప్పు వేయండి త్వరగ మగ్గుతాయి) ,ఉప్పు వేసి కలయపెట్టి మూత పెట్టండి.ఉల్లిపాయ,క్యాప్సికం కచ్చా పచ్చిగ ఉంటె టేస్టీగ బాగుంటుంది అందువల్ల ఆ రెంటిని ఎక్కువ వేయించ కూడదు.
 4. ఇప్పుడు కడాయు మూత తీసి కారం,గరంమసాల,మిరియాలపొడి,నిమ్మరసం,టమోటొ కెచప్,ఉప్పు (రుచికి సరిపడ) అన్నీ వేసి కలయ పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి.
 5. ఇప్పుడు వెజిటెబుల్స్ ఉడికే లోపు బ్రెడ్ స్లైసులను గుండ్రంగ కట్ చేసుకొవాలి(గుండ్రపటి గ్లాసు కాని గిన్నె కాని ఉపయోగించి బ్రెడ్ ని కట్ చేసుకొండి)ఇడ్లీలు చేసుకొనె ప్లేట్స్ కి నూనె కాని నెయ్యు కాని రాసుకొని,కట్ చేసుకున్న బ్రెడ్ ని ఇడ్లీ ప్లేట్ లొ క్రింద ఫొటోలొచూపిన విధంగ పెట్టుకోవాలి.
 6. ఇప్పుడు ఉడికిన వెజిటెబుల్స్ మిశ్రమంలొ కొతిమీర వేసి ఒకసారి కలయపట్టాలి.స్టవ్ ఆపేసి కడాయు ని పక్కన పెట్టుకోవాలి.
 7. ఇప్పుడు వెజిటెబుల్ మిశ్రమాన్ని 1 చెంచా చొప్పున ( 2చెంచాలు కావలి అనుకునేవారు 2 చెంచా పెట్టుకోవచ్చు) ఆ ప్లేటులోని బ్రెడ్ స్లైసుల మీద పెట్టుకోవాలి.
 8. ఇప్పుడు వెజిటెబుల్ మిశ్రమం మీద ముందుగ కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఈ క్రింద ఫొటోలొ చూపిన విధంగ పెట్టుకోవాలి.
 9. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో 11/2 గ్లాసు నీరు పోసి ఈ ప్లేటు పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
 10. ఈలోపు స్టవ్ వెలిగించి కడాయు పెట్టి 1 చెంచా నూనె వేసి వేడయ్యాక ఆవాలు,పచ్చిమిరప,కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి.
 11. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఉడికిన బ్రెడ్ ఢోక్ల ని తీసి సగానికి కట్ చేసి ఈ క్రింద ఫొటోలొ చూపిన విధంగ అమర్చుకొని వాటిమీద తాలింపు చల్లుకొని సర్వ్ చేసుకోవడమె అంతే ఎంతో రుచిగ ఉండె బ్రెడ్ ఢోక్ సాన్డ్విచ్ రెడీ

Reviews for Bread Dhokla Sandwich Recipe in Telugu (0)