బీరకాయ కూర | Ridge gourd curry Recipe in Telugu

ద్వారా kalyani shastrula  |  18th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Ridge gourd curry recipe in Telugu,బీరకాయ కూర, kalyani shastrula
బీరకాయ కూరby kalyani shastrula
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

16

0

బీరకాయ కూర వంటకం

బీరకాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ridge gourd curry Recipe in Telugu )

 • పావు కిలో బీరకాయలు
 • 2పచ్చిమిర్చి
 • 2ఎండుమిర్చి
 • కారం 1tbsn
 • ఉప్పు సరిపడా
 • నువ్వులపొడి స్పూన్
 • పచ్చికొబ్బరి తురుము ఒక కొబ్బరి చిప్ప
 • నూనె
 • శెనగపప్పు స్పూన్
 • మినప్పప్పు స్పూన్
 • ఆవాలు సగం చెంచా
 • జిలకర పావు చెంచా
 • చిటికెడు పసుపు
 • చిటికెడు ఇంగువ
 • కొత్తిమీర కట్ట
 • కరివేపాకు నాలుగు ఆకులు

బీరకాయ కూర | How to make Ridge gourd curry Recipe in Telugu

 1. మూకుడులో పోపుకు నూనె వేసి శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ఎండుమిర్చి జిలకర పసుపు ,ఇంగువ ,పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగాక పొట్టుతీసి చేదు చూసుకుని గుండ్రంగా తరిగిన బీరకాయ ముక్కలు వేసి కలిపి కొద్దిగా నీళ్లు చిలకరించి మూత పెట్టి ,మగ్గించుకోవాలి
 2. కూర మగ్గినాక ఉప్పు ,కారం నువ్వులపొడి పచ్చి కొబ్బరిపొడి వేసి కలిపి కాసేపు పొయ్యి మీద వేగనివ్వాలి
 3. కూర బాగా ఉడికి దగ్గరపడ్డాక కొత్తిమీర వేసి కలిపి తీసుకోవాలి

Reviews for Ridge gourd curry Recipe in Telugu (0)