హోమ్ / వంటకాలు / కొత్తిమీర అన్నం.

Photo of Coriander rice by దూసి గీత at BetterButter
1
5
0.0(0)
0

కొత్తిమీర అన్నం.

Mar-21-2019
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర అన్నం. రెసిపీ గురించి

ఆకు కూరల్లో కొత్తిమీర ఎంతో ప్రత్యేకమైనది.ఏ వంటకానికైనా కొత్తిమీర జోడిస్తే రుచీ,సువాసన తో పాటూ చూడ్డానికి కూడా బావుంటుంది.అంతే కాక కొత్తిమీర ఆరోగ్య పరంగా కూడా చాలా మంచిది.అటువంటి కొత్తిమీరతో ఇలా ప్రత్యేకంగా చేస్తే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు.మిగిలిన అన్నం తో కూడా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ఆంధ్రప్రదేశ్
 • ప్రధాన వంటకం
 • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

 1. బియ్యం- 1 కప్పు.
 2. కొత్తిమీర- 4 కట్టలు.
 3. కరివేపాకు,పుదీనా - 1/2 కప్పు.
 4. పచ్చిమిర్చి - 4
 5. అల్లం - చిన్నముక్క.
 6. లవంగాలు - 2 , దాల్చినచెక్క- చిన్న ముక్క,బిర్యానీ ఆకు - 1
 7. ఉప్పు 1/4 చెంచా.
 8. నెయ్యి - 1 చెంచా.
 9. ఉల్లిపాయ - 1
 10. మిరియాల పొడి- 1/4 చెంచా

సూచనలు

 1. ముందుగా కొత్తిమీర,పుదీనా,కరివేపాకు,అల్లం, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మూకుడు లో నెయ్యి వేడెక్కాక,లవంగాలు,దాల్చినచెక్క,బిర్యానీ ఆకూ వేసి వేయించాలి. అవి వేగేక, ఉల్లిపాయముక్కలు వేయించాలి.
 2. తర్వాత కొత్తిమీర పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించాలి. తర్వాత 2 కప్పు నీళ్ళు పోసి, మరుగుతున్నప్పుడు బియ్యం, మిరియాల పొడీ వేసి బాగా కలిపి మూత పెట్టాలి. 10 నిమిషాలు లో ఘుమఘుమలాడే కొత్తిమీర రైస్ తయారయిపోతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర