వంకాయ కూర. | Brinjal curry. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  22nd Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Brinjal curry. by దూసి గీత at BetterButter
వంకాయ కూర.by దూసి గీత
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

24

0

వంకాయ కూర. వంటకం

వంకాయ కూర. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal curry. Recipe in Telugu )

 • వంకాయలు- 1/4 కిలో.
 • టమాటా- 1
 • శనగలు/ పచ్చిబఠాణీ- 1/4 కప్పు.
 • అల్లం, పచ్చిమిర్చి పేస్ట్- 1/2 చెంచా.
 • చింతపండు గుజ్జు- 1 చెంచా.
 • మెంతిపొడి కోసం: శనగపప్పు, మినప్పప్పు,ధనియాలు,మెంతులు, జీలకర్ర,- అన్నీకలిపి 1/2 కప్పు.
 • ఎండుమిర్చి - 5
 • వేరుశనగపలుకులు/ జీడిపప్పు ( ఆప్షనల్)- 1/4 కప్పు.
 • ఉప్పు- 1/2 చెంచా.
 • నూనె అవసరం అసలుండదు.
 • ఇంకా రుచికోసం కావాలనుకుంటే - 1లేక 2 చెంచాలు.

వంకాయ కూర. | How to make Brinjal curry. Recipe in Telugu

 1. ముందుగా మెంతిపొడి కోసం చెప్పిన దినుసులన్నీ ఎర్రగా వేయించి బరకగా పొడి చేసి పెట్టుకోవాలి.( ఈ మెంతి పొడి ఎక్కువ మొత్తంలో చేసి ఉంచుకుంటే,బెండకాయ,దొండకాయ,కేప్సికమ్,కంద, ఇలా అన్నిటికీ వాడుకోవచ్చు).
 2. మూకుడులో నీళ్ళు పోసి,వంకాయ,బంగాళదుంప లు క్యూబ్స్ లా కట్ చేసి వెయ్యాలి 2 నిమిషాలు అయ్యేక,ఉప్పు,పసుపు వెయ్యాలి. కొంచెం ఉడికిన తర్వాత, టమాటా,అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఉడికించాలి.
 3. తర్వాత, శనగలు/ పచ్చి బఠాణీలు వెయ్యాలి. ఇదే సమయంలో చింతపండు గుజ్జు కూడా వెయ్యాలి. అన్నీ కలిపి 5 నిమిషాలు ఉడికిన తర్వాత మెంతి పొడి రెండు/ మూడు చెంచాలు వేసి, 5 నిమిషాలు ఉంచి ,కరివేపాకు,కొత్తిమీర వేసి దించేయాలి. ఎంతో రుచిగా ఉండే వంకాయ సంతర్పణ కూర తయారు.

నా చిట్కా:

ఈ కూరని బాగా మెత్తగా చేసి కాస్త పల్చగా చేసుకుంటే,చపాతీ,పుల్కాలతో కూడా బావుంటుంది.

Reviews for Brinjal curry. Recipe in Telugu (0)