హోమ్ / వంటకాలు / చిరుధాన్యాల,తృణ ధాన్యాల దలియా తో కిచిడీ.

Photo of Multi grain,multi millet daliya kichidi. by దూసి గీత at BetterButter
519
2
0.0(0)
0

చిరుధాన్యాల,తృణ ధాన్యాల దలియా తో కిచిడీ.

Mar-22-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిరుధాన్యాల,తృణ ధాన్యాల దలియా తో కిచిడీ. రెసిపీ గురించి

చాలా ఆరోగ్యకరమైన,రుచికరమైన పోషకాహారం. ఈ రోజుల్లో చిరుధాన్యాల వాడకం బాగా పెరిగింది.వాటిని అలాగే తీసుకునేకంటే,ఇలా దలియా తో చేస్తే రుచికి రుచీ,ఆరోగ్యం కూడా.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అన్నిరకాల చిరుధాన్యాలు,గోధుమలు,పెసలు,మినుములు- 2 కప్పులు.
  2. కేరట్,బీన్స్, బఠాణీ,పాలకూర తరుగు - 1 1/2 కప్పు.
  3. పచ్చిమిర్చి- 2
  4. ఉప్పు - 1/4 చెంచా.
  5. లవంగాలు - 2,దాల్చినచెక్క - చిన్న ముక్క.
  6. బిర్యానీ ఆకు- 1
  7. మిరియాల పొడి- చిటికెడు.
  8. పసుపు- చిటికెడు.
  9. నెయ్యి- 1 చెంచా.
  10. జీలకర్ర- 1/2 చెంచా.
  11. అల్లం తురుము - 1/4 చెంచా.

సూచనలు

  1. చిరుధాన్యాలు,గోధుమలు,పెసలు,మోనుములూ..అన్నీ మిక్సీ లో వేసి రవ్వ లా చేసుకోవాలి. ఈ రవ్వని కుక్కర్లో ఉడికించుకోవాలి.
  2. ఈ లోగా మూకుడు లో నెయ్యి వేసి, జీలకర్ర,మిగిలిన మసాలా దినుసులన్నీ వేసి,వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
  3. ఆ తర్వాత కేరాఫ్,బీన్స్, బఠాణీ కూడా వేసి ఉప్పు,పసుపు వేసి ఉడికించాలి. అవి ఉడికిన తర్వాత పాలకూర తరుగు వెయ్యాలి.
  4. అదీ మగ్గిన తర్వాత ఉడికిన దలియా మిశ్రమం వేసి కప్పుడు నీళ్ళు పోసి 5 నుండీ 10 నిమిషాలు ఉడికించాలి.
  5. తర్వాత నెయ్యీ,చిటికెడు మిరియాల పొడీ వేసి కలిపి దించేయాలి. చాలా రుచిగా ఉంటుంది. ఓ కప్పుడు తింటే చాలు కడుపు నిండిపోతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర