క్యూట్ పప్పీ బట్టర్ కుకీస్ | Cute Puppy cookies Recipe in Telugu

ద్వారా chepuri neeraja  |  23rd Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Cute Puppy cookies  by chepuri neeraja at BetterButter
క్యూట్ పప్పీ బట్టర్ కుకీస్ by chepuri neeraja
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

6

0

క్యూట్ పప్పీ బట్టర్ కుకీస్ వంటకం

క్యూట్ పప్పీ బట్టర్ కుకీస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cute Puppy cookies Recipe in Telugu )

  • మైదా : 200gm
  • చక్కర పొడి : 50gm
  • వెన్న :125gm
  • పాలు :2tbsp
  • వెనిలా ఎసెన్స్ :1tsp
  • చాకోస్ (chocos ):కొన్ని
  • చాక్లెట్ చిప్స్ : కొన్ని
  • కోకో పౌడర్ : తగినంత

క్యూట్ పప్పీ బట్టర్ కుకీస్ | How to make Cute Puppy cookies Recipe in Telugu

  1. మొదట ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా, వెన్న, చక్కర అన్ని కలుపు కోవాలి. దాన్ని చక్కగా మర్దన చేసుకోవాలి ఆ మిశ్రమం మొత్తం చక్కగా రవ్వ లాగా పొడి పొడి గా అవ్వాలి.
  2. తర్వాత ఆ మిశ్రమం లో కొన్ని పాలు పోసుకోవాలి తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకొని ముద్ద లాగా చేసుకోవాలి
  3. తర్వాత మిశ్రమాన్ని చిన్న చిన్న సమాన ఉండలుగా చేసుకొని బాల్ లాగా చుట్టుకోవాలి
  4. ఇపుడు ఒక్కో బాల్ తీసుకొని దానికి రెండు చాకోస్ తీసుకొని చెవుల్లాగా పెట్టుకోవాలి
  5. కళ్ళు, ముక్కు కోసం చాక్లెట్ చిప్స్ ని పెట్టుకొని పప్పీ లాగా చేసుకోవాలి.
  6. ఇపుడు చేసుకున్న పప్పీ కుకీస్ ని ఓవెన్ లో 160 డిగ్రీస్ లో 10 నిముషాలు బేక్ చేసుకోవాలి... కుకీస్ రెడీ... ఇదే పిండి లో కాస్త కోకో పౌడర్ వేసుకొని రక రకాలుగా గా డిజైన్స్ చేసుకోవచు

నా చిట్కా:

వెన్న సాఫ్ట్ గా ఉండాలి,ఫ్రిడ్జ్ లో నుండి తీసింది ఉండకూడదు. ఓవెన్ లేని వాళ్ళు కుక్కర్ లో బేక్ చేసుకోవచు

Reviews for Cute Puppy cookies Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo