BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ముంబై మసాలా టోస్ట్

Photo of Mumbai masala toast by Swapna Sashikanth Tirumamidi at BetterButter
0
2
0(0)
0

ముంబై మసాలా టోస్ట్

Mar-25-2019
Swapna Sashikanth Tirumamidi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముంబై మసాలా టోస్ట్ రెసిపీ గురించి

ఈ టోస్ట్ రుచి లో మామూలు వాటికన్న భిన్నంగా ఉంటుంది ,అతి తక్కువ సమయంలో చేసుకోవచ్చు.చాలా సులువు.ఇది సాధారణంగా ఉడికించిన బంగాళదుంప తో చేస్తారు...దానికి ఎక్కువ సమయం పడుతుంది అని, నేను దుంపని సన్నగా కోరి ,టైమర్ పెట్టుకుని టెస్ట్ చేసి మరీ చేయడం జరిగింది.ఈ విధానం మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను.దీని పిల్లలకి,పెద్దలకు లంచ్ బాక్స్ లో పెట్టవచ్చు.సాయంత్రపు చిరితిండిగా లేక అల్పాహారంగా కూడా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • మహారాష్ట్ర
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. బంగాళదుంప 1
  2. నచ్చిన బ్రెడ్ ముక్కలు 4(2 ముక్కలు ఒక్కరికి చప్పున)
  3. ఉల్లిపాయ చక్రాలు 4
  4. టమాటా చక్రాలు 4
  5. క్యాప్సికమ్ చక్రాలు 4
  6. ఆవాలు అరచెంచా
  7. చాట్ మసాలా అర చెంచా
  8. జీలకర్ర అరచెంచా
  9. పసుపు చిటికెడు
  10. ఉప్పు సరిపడా
  11. అల్లం తరుగు ఒక చెంచా
  12. కారం ఒక చెంచా
  13. కొత్తిమీర తరుగు 2 చెంచాలు
  14. నూని 2 చెంచాలు.
  15. బటర్ 2 చెంచాలు
  16. సన్న కారప్పూస/సేవ్ 2 చెంచాలు
  17. గ్రీన్ చట్నీ కి...పుదీనా ఒక కప్పు
  18. కొత్తిమీర ఒకకప్పు
  19. పచ్చిమిర్చి 2
  20. పంచదార 1 చెంచా
  21. నిమ్మరసం ఒక చెంచా
  22. కొద్దిగా ఉప్పు

సూచనలు

  1. బంగాళదుంప చెక్కుతీసి సన్నగా కోరి పెట్టుకోవాలి.
  2. మూకుడు పెట్టి 2 చెంచాల నూని వేసి వేడి చేసి ఆవాలు ,జీలకర్ర, అల్లంముక్కలు వేసి వేయించాలి.
  3. ఇప్పుడు బంగాళదుంప కోరు వేసి పసుపు,కొద్దిగా ఉప్పువేసి 3,4 నిమిషాలు వేయించాలి.అవసరం ఐతే కాసిన్ని నీళ్లు చిలకరించవచ్చు.
  4. ఇదివేగేలోపు మిక్సీలో పుదీనా,కొత్తిమీర,పంచదార,పచ్చిమిర్చి నిమ్మరసం,ఉప్పు వేసిమెత్తగా పేస్ట్ చేసుకుంటే గ్రీన్ చట్నీ తయారవుతుంది.
  5. ఇప్పుడు కోరు బాగా వేగాక,కారం,చాట్ మసాలా,కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి మంట కట్టేయ్యాలి.
  6. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తీసుకుని ఒకపక్క కొద్దిగా గ్రీన్ చట్నీ రాసి,2ఉల్లి చక్రాలు,2 టమాటా చక్రాలు పెట్టి ,రెడి చేసిన మసాలా కూరని కొద్దిగా వీటిపై పెట్టి ,2క్యాప్సికమ్ చక్రాలు పెట్టి ఇప్పుడు రెండో బ్రెడ్ ముక్క ని కూడా దానిపై బోర్లించి పెట్టాలి.
  7. ఇప్పుడు పెనం వేడిచేసి...బటర్ వేసి రెడి చేసిన శాండ్విచ్ ని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.మరో రెండు బ్రెడ్ ముక్కలతో ఇదే విధంగా మరో శాండ్విచ్ చేసుకోవాలి.
  8. ఇప్పుడు నచ్చిన విధంగా కట్ చేసి సర్వింగ్ ప్లేటులోకి తీసుకుని ,పైన మళ్ళీ గ్రీన్ చట్నీ రాసి సన్న కారప్పూస వేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర