తోటకూర పెరుగు పచ్చడి | Amaranthus curd chutney. Recipe in Telugu

ద్వారా Swapna Sashikanth Tirumamidi  |  26th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Amaranthus curd chutney. by Swapna Sashikanth Tirumamidi at BetterButter
తోటకూర పెరుగు పచ్చడిby Swapna Sashikanth Tirumamidi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

17

0

తోటకూర పెరుగు పచ్చడి వంటకం

తోటకూర పెరుగు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Amaranthus curd chutney. Recipe in Telugu )

  • లేత తోటకూర ఒక కట్ట
  • పెరుగు 2 కప్పులు
  • నెయ్యి 3 చెంచాలు
  • శెనగపప్పు ఒక చెంచా
  • మినపప్పు అర చెంచా
  • ఆవాలు పావు చెంచా
  • ఇంగువ కొద్దిగా
  • ఉప్పు సరిపడా
  • ఎండుమిర్చి2
  • అల్లం తరుగు ఒక చెంచా
  • పచ్చిమిర్చి 2(కావాలంటే/ఆప్షన్)
  • కరివేపాకు ఒక రెమ్మ
  • పసుపు చిటికెడు

తోటకూర పెరుగు పచ్చడి | How to make Amaranthus curd chutney. Recipe in Telugu

  1. తోటకూర శుభ్రం చేసి,కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. మూకుడులో నెయ్యివేసి కాగాక ఆవాలు,మినపప్పు,శెనగపప్పు,పచ్చిమిర్చి,అల్లం ముక్కలు,ఇంగువ,పసుపు వేసి కమ్మగా వేయించి తరిగిన తోటకూర వేసి కలిపి ఉప్పు, కాసిన్ని నీళ్లు చల్లి మూత పెట్టి మగ్గించాలి
  3. అది మగ్గేలోపు గట్టి పెరుగుని ఒక గిన్నీలోకి తీసుకుని కాస్త ఉప్పు,పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి.ఇష్టమున్నవారు పుల్లని పెరుగు వాడవచ్చు.
  4. ఇప్పుడు మగ్గిన తోటకూరని ఈ పెరుగులో కలిపి మళ్ళీ పైన ఆవాలు,పప్పులు, ఎండుమిర్చి,కరివేపాకు వేసి పోపు పెట్టుకుంటే చక్కని తోటకూర పెరుగు పచ్చడి సిద్ధం.

నా చిట్కా:

ఏ పెరుగు పచ్చడి అయినా పోపుని నెయ్యితో పోపు పెట్టుకుంటే ఆ పదార్ధం రుచిగా ఉంటుంది.

Reviews for Amaranthus curd chutney. Recipe in Telugu (0)