హోమ్ / వంటకాలు / తోటకూర పెరుగు పచ్చడి

Photo of Amaranthus curd chutney. by Swapna Tirumamidi at BetterButter
510
7
0.0(0)
0

తోటకూర పెరుగు పచ్చడి

Mar-26-2019
Swapna Tirumamidi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర పెరుగు పచ్చడి రెసిపీ గురించి

తోటకూర పెరుగు పచ్చడి చాలా తేలిక.10 నిముషాల్లో చేసుకోవచ్చు.చాలా రుచిగా కమ్మగా బావుంటుంది.అన్నం లోకి,రోటీ లోకి కూడా తినవచ్చు. లేత తోటకూర ఐతే కాడలు కూడా వేసుకోవచ్చు,కాస్త ముదురుది ఐతే ఆకులు మాత్రమే వేసుకుని కాడలతో విడిగా పులుసు చేయవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. లేత తోటకూర ఒక కట్ట
  2. పెరుగు 2 కప్పులు
  3. నెయ్యి 3 చెంచాలు
  4. శెనగపప్పు ఒక చెంచా
  5. మినపప్పు అర చెంచా
  6. ఆవాలు పావు చెంచా
  7. ఇంగువ కొద్దిగా
  8. ఉప్పు సరిపడా
  9. ఎండుమిర్చి2
  10. అల్లం తరుగు ఒక చెంచా
  11. పచ్చిమిర్చి 2(కావాలంటే/ఆప్షన్)
  12. కరివేపాకు ఒక రెమ్మ
  13. పసుపు చిటికెడు

సూచనలు

  1. తోటకూర శుభ్రం చేసి,కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. మూకుడులో నెయ్యివేసి కాగాక ఆవాలు,మినపప్పు,శెనగపప్పు,పచ్చిమిర్చి,అల్లం ముక్కలు,ఇంగువ,పసుపు వేసి కమ్మగా వేయించి తరిగిన తోటకూర వేసి కలిపి ఉప్పు, కాసిన్ని నీళ్లు చల్లి మూత పెట్టి మగ్గించాలి
  3. అది మగ్గేలోపు గట్టి పెరుగుని ఒక గిన్నీలోకి తీసుకుని కాస్త ఉప్పు,పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి.ఇష్టమున్నవారు పుల్లని పెరుగు వాడవచ్చు.
  4. ఇప్పుడు మగ్గిన తోటకూరని ఈ పెరుగులో కలిపి మళ్ళీ పైన ఆవాలు,పప్పులు, ఎండుమిర్చి,కరివేపాకు వేసి పోపు పెట్టుకుంటే చక్కని తోటకూర పెరుగు పచ్చడి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర