హోమ్ / వంటకాలు / Carrot ,Orange halwa

Photo of Carrot ,Orange halwa by Swapna Tirumamidi at BetterButter
508
5
0.0(1)
0

Carrot ,Orange halwa

Mar-27-2019
Swapna Tirumamidi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఉత్తర భారతీయ
  • దోరగా వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. క్యారెట్లు 4
  2. తియ్యని నారింజ పండ్లు 2
  3. పంచదార 150 గ్రాములు
  4. పాలపొడి 4 చెంచాలు
  5. నెయ్యి 100 గ్రాములు
  6. యాలకుల పొడి అర చెంచా.
  7. నచ్చిన పప్పులు(నేను జీడిపప్పు6, సార పప్పు ఒక చెంచా వాడాను) తగినన్ని.

సూచనలు

  1. ముందు క్యారెట్లు నారింజలు చెక్కు తీసి,నారింజ తొనల్లోని గింజలు తీసేసి అన్ని కలిపి జూసెర్ లో వేసి రసం తీసి పిప్పిని ,రసాన్నిపక్కన పెట్టుకోవాలి.(నేను వాడిన జూసెర్ లో పిప్పి ,రసము విడివిడిగా వస్తాయి.పల్ప్ మొత్తం 240గ్రాములు వచ్చింది. )
  2. ఇప్పుడు మూకుడు పెట్టి కొద్దిగా నెయ్యివేసి పప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు అదే మూకుడులో మరి కొంచం నెయ్యివేసి రసంతియ్యగా వచ్చిన పల్ప్ ని వేసి 4 నిమిషాలు వేయించాలి.
  4. ఇప్పుడు పాలపొడి కలిపి 2 నిమిషాలు ఆపకుండా వేయించాలి.
  5. ఇప్పుడు తీసిన రసంలో సగం రసం కూడా వేసి కలపాలి.(ఉదాహరణకు ఒక గ్లాసు రసం వస్తే అర గ్లాసు రసాన్ని వెయ్యాలి)
  6. ఇప్పుడు పంచదార వేసి కలపాలి.(ఇక్కడ పంచదారని క్యారెట్,నారింజల తీపి శాతాన్ని బట్టి ఎక్కువగా..లేదా తక్కువగా తీసుకోవాలి.)
  7. పంచదార వేసాక అది కరిగి దగ్గరపడేదాక కలుపుతూ వండాలి. మధ్యలో కొంచం నెయ్యి వెయ్యాలి.
  8. ఇప్పుడు యాలకుల పొడి వేసి కలిపి ,వేయించిన పప్పులు వేసి కలిపి దించుకోవాలి.
  9. అంతే చక్కటి రుచికరమైన తీపి, చిరు పులుపుగా క్యారెట్,ఆరంజ్ హల్వా సిద్ధం...వేడివేడిగా తింటే ఆ రుచేవేరు మరి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Annapurna jinkala
Mar-28-2019
Annapurna jinkala   Mar-28-2019

యుమ్య్ హల్వా

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర