హోమ్ / వంటకాలు / గొజ్జు అవలక్కి మిక్స్

Photo of Gojju avalakki by Rashmi SudhiMurthy at BetterButter
1236
0
0.0(0)
0

గొజ్జు అవలక్కి మిక్స్

Mar-28-2019
Rashmi SudhiMurthy
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గొజ్జు అవలక్కి మిక్స్ రెసిపీ గురించి

ఇది అటుకుల తో చేసే ఒక టిఫిన్.ఈ మిక్స్ ఎక్కడైనా టూరుకి వెళ్ళినప్పుడు,ఉపవాసం ఉన్నప్పుడు,ప్రయాణం లో,లేక పిల్లలకి ఇన్స్టంట్ గా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • కర్ణాటక
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. అటుకుల (గట్టివి ) పొడి 1 కప్
  2. చింతపండు( గోలి అంత)
  3. బెల్లం తురుము 1 టీ స్పూన్
  4. పల్లిలు 2 టేబుల్ స్పూన్లు
  5. ఉప్పు రుచికి సరిపడా
  6. పోపు దినుసులు 1 టీ స్పూన్ ( ఆవాలు,మినప్పప్పు,శెనగపప్పు)
  7. ఇంగువ 1/4 టీ స్పూన్
  8. మసాలా పుడి కోసం- ధనియాలు 1/2 టీ స్పూన్
  9. ఎండుమిరపకాయలు 4
  10. ఆవాలు 1/4 టీ స్పూన్
  11. జీలకర్ర 1/4 టీ స్పూన్
  12. మెంతెలు చిటికెడు
  13. పసుపు 1/4 టీ స్పూన్
  14. నూనె 1 టేబుల్ స్పూన్
  15. నీళ్ళు 1 కప్
  16. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. ముందుగా అటుకులను బరకగా పొడి చేయాలి( రవ్వ లాగా ఉండాలి)
  2. ఒక పాన్ లో నూనె వేడి చేసి చింతపండు, మసాలా పొడి కోసం ఉన్న పదార్థాలు వేసి దోరగా వేయించి బెల్లం కూడా వేసి పొడి చేసుకోవాలి
  3. ఇప్పుడు కొంచెం నూనె వేడి చేసి పోపు,ఇంగువ, పల్లిలు,పసుపు,కరివేపాకు వేసి వేయించాలి
  4. ఒక బౌల్ లో అటుకులపుడి, మసాలపుడి, ఉప్పు,పోపు వేసి కలిపి పెట్టి ఒక బాక్స్ లో వేసి నిలువ పెట్టుకోవచ్చు
  5. ఇప్పుడు అటుకుల మిక్స్ రెడీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక కప్ అటుకుల మిక్స్ కి ఒక కప్ వేడి నీళ్ళు వేసి కలిపి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి
  6. ప్రయాణంలో కానీ ఎక్కడైనా బయట ఉన్నప్పుడు వేడినీళ్లు లేకపోతే పర్వాలేదు.మంచి నీళ్ళు కలుపుకోవచ్చు.వేడి నీళ్ళు వేసుకుంటే వేడిగా తినవచ్చు అంతే.
  7. నీళ్ళు వేసి ఐదు నిమిషాల తరువాత కలిపితే ఉప్మా లాగా కాకుండా కొంచెం డ్రై గా ఉంటుంది. ఇన్స్టంట్ గొజ్జు అవలక్కి రెడీ.కావాలంటే కొత్తిమీర, పచ్చికొబ్బరి వేసి సర్వ్ చేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర