హోమ్ / వంటకాలు / దిల్ పసంద్

Photo of Dilpasand by kalyani shastrula at BetterButter
2116
9
0.0(0)
0

దిల్ పసంద్

Mar-28-2019
kalyani shastrula
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దిల్ పసంద్ రెసిపీ గురించి

స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 8

  1. 2కప్స్ మైదా
  2. 2tbsn నెయ్యి
  3. చిటికెడు ఉప్పు
  4. టుటి ఫ్రూటీ రెడ్ కలర్ 100 gr.
  5. టుటి ఫ్రూటీ గ్రీన్ కలర్ 100gr.
  6. 1కప్ చెక్కరపొడి
  7. 1కప్ పచ్చి కొబ్బరి తురుము
  8. కొన్ని వేడి నీళ్లు

సూచనలు

  1. ముందుగా మైదా పిండిలో చిటికెడు ఉప్పు ,నెయ్యి వేసి కలపాలి .తర్వాత కొన్ని చుక్కలు వేడి నీళ్లు పోసి కలిపి ముద్ద చేసి ఓ పది నిముషాలు పక్కన పెట్టుకోవాలి .
  2. ఈలోపు టుటి ఫ్రూటీ లు కొబ్బరి కలిపి పెట్టుకోవాలి .
  3. అందులో మీక్సీ చేసిన చెక్కర కలపాలి
  4. ఈలోపు పిండి నాని ఉంటుంది బాగా పిసికి పిండి ముద్దను రెండు పెద్ద ముక్కలు ,రెండు చిన్న ముక్కలుగా కట్ చేయాలి
  5. ఈ విధంగా కట్ చేసి ,మొదలు ఒక్కొక్కదాన్ని చపాతీ వలె ఒత్తుకోవాలి
  6. చపాతీ వలె ఒత్తుకున్నాక నెయ్యి రాసి చాప వలె చుట్టుకోవాలి
  7. ఏవిధంగా చుట్టి పొడవుగా సాగించాలి
  8. దానిని ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా గుండ్రంగా చుట్టుకోవాలి
  9. ఎలాగా నాలుగు చేసుకోవాలి
  10. ఇప్పుడు అన్నింటిని చపాతీ వలె ఒత్తుకోవాలి .పెద్ద చపాతీ మీద మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవాలి .
  11. పై నుండి చిన్న చపాతీని పెట్టాలి .
  12. కింద ఉన్న పెద్ద చపాతీ ని పైకి మడుస్తూ క్లోజ్ చేసుకోవాలి .
  13. దీనినే వేడి నాన్ స్టిక్ పెనం మీద మడచిన భాగం కిందికి ఉండేట్టు వేసి కాల్చుకోవాలి
  14. రెండో వైపు కూడా కాల్చాలి .కొద్దిగా నెయ్యి వేసి కాల్చాలి
  15. రెండువైపులా కాస్త నెయ్యి రాసి మంచిగ కాల్చుకోవాలి .
  16. బాగా పొంగి చక్కగా కాలిన దిల్ పసంద్ ను ప్లేట్ లో పెట్టాలి
  17. కొద్దిగా చల్లారాక నాలుగు ముక్కలుగా కోయాలి .
  18. ఎంతో రుచికరమైన దిల్ పసంద్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర