హోమ్ / వంటకాలు / బంగాళదుంప రోష్టి

Photo of Potato stuffed rosti by Swapna Tirumamidi at BetterButter
376
4
0.0(0)
0

బంగాళదుంప రోష్టి

Mar-28-2019
Swapna Tirumamidi
15 నిమిషాలు
వండినది?
17 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప రోష్టి రెసిపీ గురించి

బంగాళదుంప ప్రేమికులకు ఇదో గమ్మత్తుఅయిన కొత్త రుచి ని అందిస్తుంది.చేయడం చాలా సులభమే.ఆచి తూచి చూసుకుని డైట్ ఫుడ్ తినేవారు ఈ ఐటమ్ కి దూరంగా ఉండక తప్పదు.ఎందుకంటే నూని కూడా ఎక్కువే పడుతుంది కాబట్టి.ఈ రోష్టి ని సాయంకాలపు చిరుతిండిలా, లేదా ఉదయం, రాత్రి ఫలహారంగా తీసుకోవచ్చు.ఇది ఒక స్నాక్ ఐటమ్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కలయిక
  • దోరగా వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. 1 పెద్ద బంగాళదుంప తురుము
  2. తాజా సాల్టెడ్క్రీమ్ 2 చెంచాలు
  3. స్వీట్ కార్న్ 4 చెంచాలు(ఉడికించినవి)
  4. క్యాప్సికమ్ ఒకటి( పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి)
  5. క్యారెట్ తురుము 6 చెంచాలు
  6. కీరా తరుగు(పొడవుగా తరిగినవి) ఒక కప్
  7. లెట్టుస్ తరుగు ఒక కప్పు
  8. మిరియం పొడి అర చెంచా
  9. మిరప దంపుడు(చిల్లీ ఫ్లేక్స్)అర చెంచా
  10. చాట్ మసాలా కొద్దిగా(ఆప్షనల్)
  11. మస్టర్డ్ క్రీమ్ 2 చెంచాలు
  12. కార్న్ ఫ్లోర్ 4 చెంచాలు.
  13. ఉప్పు తగినంత
  14. నూని వేయించడానికి ..100 గ్రాములు

సూచనలు

  1. ముందు బంగాళదుంప చెక్కుతీసి పొడవుగా తురిమి నీటిలో వేసి పెట్టుకోవాలి.
  2. ఈ తురుము చూడ్డానికి నూడిల్స్ లా పొడవుగా ఉండాలి.అంటే ఆలూని పొడవుగా పెట్టి తురుముకోవాలి.
  3. ఇప్పుడు అంచులున్న పెనం పెట్టి నూని వేసి వేడి చేసుకోవాలి
  4. అది వేడి అయ్యేలోపు ఆలూ తురుముని నీరు పూర్తిగా తీసేసి,కొద్దిగా ఉప్పు,మిరియాలపొడి,కార్న్ ఫ్లోర్,మిరప దంపుడు వేసి బాగపట్టించి కాగిన నూనెలో అట్టు పరచినట్టుగా వెయ్యాలి.మంట తక్కువ మధ్యస్తంగా ఉండాలి.
  5. ఒక పక్క కాస్త ఎర్రగా వేగగానే రెండో పక్క కూడా తిరగేసి వేయించాలి.మరీ గట్టిగా వేయించకూడదు.రెండు పక్కలా చెరో 5 నిమిషాలు వెయిస్తే చాలు.
  6. ఇప్పుడు బయటికి తీసి టిష్యూ పేపర్ మీద పెట్టి నూనిని వత్తాలి.
  7. ఇప్పుడు ఒక ప్లేట్ లో పెట్టి కొద్దిగా చాట్ మసాలా చల్లి,కొద్దిగా మస్టర్డ్ క్రీము రాసి,క్యారెట్ తురుము,కీరా ముక్కలు,స్వీట్ కార్న్, సాల్టెడ్ క్రీము,క్యాప్సికమ్ తరుగు,లెట్టుస్, మిరియంపొడి,కొద్దిగా ఉప్పు ఇలా పైన జాబితాలో ఉన్న అన్ని పదార్ధాలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి
  8. అన్ని పెట్టిన తరువాత మధ్యలోకి మడిచి నచ్చిన సాస్ తో అందిస్తే చాలు...అంతే అద్భుతమైన రుచి తో బంగాళదుంప రోష్టి ఆరగించడానికి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర