హోమ్ / వంటకాలు / తమ్మ గింజల వేపుడు.

Photo of Broad beans fry. by Swapna Tirumamidi at BetterButter
532
4
0.0(0)
0

తమ్మ గింజల వేపుడు.

Mar-28-2019
Swapna Tirumamidi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తమ్మ గింజల వేపుడు. రెసిపీ గురించి

తమ్మ చిక్కుడ్లునేవి అందరికి నచ్చవు.ఎందుకంటే వండుతున్నప్పుడు ఒకరకమైన ఘాటు వాసన కలిగివుంటాయి.కాబట్టి ఆ వాసన నచ్చనివారు ఇలా గింజలు ఒలిచి వేయించి తింటే చాలా బావుంటాయి.సరదాగా కాలక్షేపానికి స్నాక్ లా, లేదా అన్నం లో సైడ్ డిష్ గా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పచ్చి తమ్మకాయ గింజలు 2 కప్పులు
  2. కారం ఒక చెంచా
  3. ఉప్పు సరిపడా
  4. జీలకర్ర అరచెంచా
  5. గరం మసాలా పొడి అర చెంచా
  6. మొక్కజొన్న పిండి(మైజ్) 2 చెంచాలు
  7. పచ్చిమిర్చి చీలికలు 3
  8. కరివేపాకు కొద్దిగా
  9. నూని 50 గ్రాములు

సూచనలు

  1. తమ్మ చిక్కుడు గింజలు 8 నిమిషాలు నీళ్లలో ఉడికించి పెట్టుకోవాలి.దించేముందు కొద్దిగా ఉప్పు వేసి ఉంచాలి.
  2. ఇప్పుడు మూకుడు పెట్టి నూని వేసి వేడిచేసి,జీలకర్రా, మిర్చి,కరివేపాకువేసి ఉడికిన తమ్మ గింజలు నీరు తీసేసి వేసి 10 నిమిషాలు బాగా వేయించాలి.
  3. దించేముందు ఉప్పు,కారం,మొక్కజొన్న పిండి,గరంమసాలా పొడి,వేసి బాగా కలిపి 2 నిమిషాలుంచి,నూని రాకుండా వేరేగిన్నిలోకి తీసుకుంటే వేడి వేడి చిక్కుడు గింజలు సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర