హోమ్ / వంటకాలు / క్యాబేజీ అన్నం

Photo of Cabbage rice by Sarada Gopalam at BetterButter
471
1
0.0(0)
0

క్యాబేజీ అన్నం

Mar-28-2019
Sarada Gopalam
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజీ అన్నం రెసిపీ గురించి

కూరలు కలిసిన అన్నం.పిల్లలకి మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 3 చమ్చాలు నూనె
  2. ¾ చిన్న చమ్చా ఆవాలు
  3. 1 చిన్న చమ్చా జీరా
  4. కొద్దిగా కర్వేపాకు ఆకులు
  5. 2 చమ్చాల జీడిపప్పు లేదా వేరుశనగపప్పు
  6. 2 చీల్చిన పచ్చిమిర్చి
  7. ½ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు
  8. ¼ కప్పు తురిమిన క్యారట్
  9. (నచ్చితనవారు) సన్నగా తరిగిన బుంగమిరపకాయ(క్యాప్సికమ్)
  10. 2 కప్పులు సన్నగా తరిగిన క్యాబేజి
  11. రుచికి తగినంత ఉప్పు
  12. ¼ చిన్న చమ్చా పసుపు
  13. ½ చమ్చా కారం
  14. ½చమ్చా గరం మసలా
  15. 2 కప్పులు ఉడికించి వుంచిన అన్నం
  16. ఇష్టమయిన వారు 2 చమ్చాల కొబ్బరి తురుము

సూచనలు

  1. 1. ముందుగా రెండు కప్పుల బియ్యాని శుభ్రంగా కడిగి electric coocker lo కానీ, pressure coocker లో కానీ కాస్త ఎసరు తక్కువ పోసి అన్నం పొడిగా ఉడడికించుకోవాలి. రెండు కప్పుల అన్నం 15 నిమిషాలు పడుతుంది.ఈలోపు క్యాబేజీ కూరని తయారు చేసుకుందాం. 2..పొయ్యిమీద ఒక వెడల్పాటి మూకుడులో పైన చెప్పిన కొలత ప్రకారం నూనె వేసి వేడి చేసి నూనె వేడి ఎక్కాకా అందులో పైన చెప్పిన కొలత ప్రకారం ఆవాలు, జీలకర్ర వేయించుకొని,వేగాకా కరివేపాకు కూడావేసి వేయించుకోవాలి. 3. కొద్దిగా పొయ్యిమంటని తగ్గించుకొని అందులోనే వేరుశనగపప్పు లేదా జీడిపప్పు వేయించుకోవాలి. 4. తరువాత రెండుగా చీల్చివుంచుకున్న పచ్చిమిర్చిని, ఉల్లిపాయ ముక్కలని వేసి ఉల్లిపాయలు రంగుమారేదాకా వేయించుకోవాలి. 5. ఉల్లిపాయలు వేగాకా, అందులోనే క్యారట్, క్యాప్సికమ్ కూడా వేసి మంచిగా ఉడకనివ్వాలి. 6. ఇప్పుడు తరిగివుంచిన క్యాబేజిని,రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసి బాగా ఉడకనివ్వాలి(నీళ్ళు ఇగిరి పోవాలి).అడుగంటకుండా మధ్యలో కలుపుతూ చక్కగా ఉడకనివ్వాలి.అలా అని Padte లాగా అయిపోకూడదు. సుమారు 3 to 5 నిమిషాలుఅనుకోండి. 7. అలా ఉడుకుతున్నప్పుడే పైన చెప్పినవిధంగా పసుపు,కారం, గరంమసాలా పొడి వేసి మొత్తం అంతా అంటేలా కలియబెట్టాలి. 8. ఈపాటికి వేడిగా అన్నం అయివుంటుంది. ఆ అన్నం ని ఈమిశ్రమంలో బాగా కలిసేటట్టు కలుపుకుని చివరిగా కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే వేడివేడి క్యాబేజీ రైస్ 20 నిమిషాలలో Ready!!! అంతేకాదు పిల్లలకి విడిగా క్యాబేజీని కానీ, క్యాప్సికంని కానీ school box లో కలిపిస్తే box as it is ఇంటికి రావటం ఖాయం. అదే కూరలతో flovours mix చేసి ఇలా చేస్తే "శర్మా" ఖాళీ, "శాస్త్రీ" ఖాళీ అన్న మాయాబజార్ dialogue గుర్తు చేసుకుంటాం వాళ్ళ lunch box చూసి :-) పైగా నూనె తక్కువగా పడుతుంది కాబట్టి పెద్దవారికీ మంచిదే! ఉభయకుశులోపరి :-) ఏమంటారు? ఆలస్యం చేయకుండా Try it మరి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర