దాల్ తడ్కా. | Dal thadka Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  30th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Dal thadka by దూసి గీత at BetterButter
దాల్ తడ్కా.by దూసి గీత
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

దాల్ తడ్కా. వంటకం

దాల్ తడ్కా. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dal thadka Recipe in Telugu )

  • కందిపప్పు- 1/2 కప్పు.
  • పెసరపప్పు- 1/2 కప్పు.
  • శనగపప్పు- 1/4 కప్పు.
  • మసూర్ పప్పు- 1/4 కప్పు.
  • చిన్న ఉల్లిపాయ- 1
  • చిన్న టమాటా- 1
  • పచ్చిమిర్చి- 2
  • అల్లం - చిన్నముక్క
  • ధనియాలపొడి- 1/4 చెంచా.
  • గరం మసాలా- 1/4 చెంచా.
  • ఉప్పు- 1/2 చెంచా.
  • పసుపు- 1/4 చెంచా.
  • ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి,ఇంగువ- 1/2 చెంచా.
  • కసూరి మేథీ- 1/4 చెంచా.
  • కరివేపాకు, కొత్తిమీర - 1/4 కప్పు.
  • చింతపండురసం( ఆప్షనల్) - 2చెంచాలు.

దాల్ తడ్కా. | How to make Dal thadka Recipe in Telugu

  1. ముందుగా పప్పులన్నీ కలిపి కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. మూకుడులో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి,ఇంగువ తో పోపు వెయించాలి. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి,టమాటా వరుసగా వేసి వేయించాలి.ఉప్పు,పసుపు కూడా వెయ్యాలి. ఇప్పుడు ఉడికిన పప్పుల మిశ్రమం మెత్తగా చేసి అందులో వెయ్యాలి. తర్వాత ధనియాలు పొడీ,గరం మసాలా,కసూరిమేథీ వెయ్యాలి. ఇష్టమైతే చింతపండు రసం కూడా ఇప్పుడే వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉడికించి, కొత్తిమీర వేసి దించేయాలి.

Reviews for Dal thadka Recipe in Telugu (0)