దద్దోజనం | Curd rice. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  31st Mar 2019  |  
2 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Curd rice. by దూసి గీత at BetterButter
దద్దోజనంby దూసి గీత
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

20

1

దద్దోజనం వంటకం

దద్దోజనం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curd rice. Recipe in Telugu )

 • అన్నం- 1 కప్పు
 • పెరుగు- 1 1/2 కప్పు.
 • సన్నగా తరిగిన కేరట్ ముక్కలు - 1/4 కప్పు.
 • సన్నగా తరిగిన కీరా ముక్కలు- 1/4 కప్పు.
 • అల్లం, పచ్చిమిర్చి-1/4 చెంచా.
 • వాము- 1/2 చెంచా.
 • ఆవాలు, జీలకర్ర- 1)4 చెంచా‌
 • కరివేపాకు, కొత్తిమీర
 • ఎండుమిర్చి- 1
 • జీడిపప్పు,బాదాం- 1/4 కప్పు.

దద్దోజనం | How to make Curd rice. Recipe in Telugu

 1. పెరుగు చిలికి,అందులో ఉప్పు కలిపి ఉంచాలి. అన్నం మెత్తగా చేసి పెరుగులో వెయ్యాలి. కేరట్,కీర దోస,అల్లం, పచ్చిమిర్చి పేస్ట్,వాము,కొత్తిమీర, కరివేపాకు,జీడిపప్పు,బాదాం పలుకులూ...ఇవన్నీ పెరుగు మిశ్రమం లో వేసి బాగా కలపాలి. చివరిగా ఆవాలు,జీరా, ఎండుమిర్చి తో పోపు పెట్టాలి. వేసవి లో ఈ రకమైన కర్డ్ రైస్ తీసుకుంటే చలువ చేస్తుంది.వడదెబ్బ తగలదు..

నా చిట్కా:

ఈ కర్డ్ రైస్ లో నేతి తో పోపు పెడితే కమ్మగా బావుంటుంది

Reviews for Curd rice. Recipe in Telugu (1)

John babu Jarugula9 months ago

'దద్దోజనం' అనేది వాడుక భాషలో అంటారు. దధి ఓదనం= దద్యోదనం(సంస్క్రతం). దధి=పెరుగు. ఓదనం=అన్నం.
జవాబు వ్రాయండి