హోమ్ / వంటకాలు / Paneer butter masala

Photo of Paneer butter masala by Swapna Sunil at BetterButter
1001
7
0.0(1)
0

Paneer butter masala

Apr-03-2019
Swapna Sunil
20 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • ఉత్తర భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. 250 గ్రా : పనీర్
  2. 1 స్పూన్ : ఉప్పు
  3. 1 స్పూన్ : కారం
  4. 1/2 స్పూన్ : గరం మసాలా
  5. 1/4 స్పూన్ : పసుపు
  6. 1 స్పూన్ : నీళ్ళు
  7. 1 స్పూన్ : నెయ్యి
  8. గ్రేవీ : 3 టేబుల్ స్పూన్లు : నూనె
  9. 1 టేబుల్ స్పూన్ : నెయ్యి
  10. 1 స్పూన్ : జీలకర్ర
  11. 3 : యాలకులు
  12. అంగులo ముక్క : దాల్చిన చెక్క
  13. 4 : లవంగాలు
  14. 2 మద్యరకం : ఉల్లిపాయలు (బరకగా రుబ్బాలి)
  15. 4 మద్యరకం : టమాటాలు (కచ్చా పచ్చా గా రుబ్బుకోవాలి)
  16. 1 చిన్న ముక్క : అల్లం (సన్నగా తిరిగింది)
  17. 4 : వెల్లుల్లి రెబ్బలు (సన్నగా తరిగినవి)
  18. ఉప్పు రుచికి సరిపడా
  19. 1 స్పూన్ : కారం
  20. 1/4 స్పూన్ : మిరియాల పొడి
  21. 1 స్పూన్ : కసూరి మేథీ (నలిపినది)
  22. 1/2 స్పూన్ : గరం మసాలా
  23. 1 స్పూన్ : ధనియాలు జీలకర్ర పొడి
  24. 1 టేబుల్ స్పూన్ : చెనెగపిండి
  25. 2 టేబుల్ స్పూన్లు : కొత్తిమీర (సన్నగా తిరిగింది)
  26. నీళ్ళు తగినన్ని

సూచనలు

  1. మొదట 250గ్రా పనీర్ ముక్కలని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు,1 స్పూన్ కారం,1/2 స్పూన్ గరం మసాలా పొడి,1/4 స్పూన్ పసుపు,ఒక చెంచాడు నీళ్ళు వేసుకొని బాగా కలిపి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
  2. గ్రేవీ : ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని వేడి చేసి అందులో 3 చెంచాల నూనె మరియు ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోండి.
  3. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, యాలకులు, లవంగాలు , దాల్చిన చెక్క వేసి వేయించుకుని బరకగా రుబ్బుకున్న ఉల్లిపాయలు వేసుకొని బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
  4. సన్నగా తరిగిన వెల్లుల్లి , అల్లం ముక్కలు వేసి ఒక నిమిషం వేయించండి.
  5. వేగిన ఉల్లి లో కారం, మిరియాల పొడి, ధనియాలు జీలకర్ర పొడి , గరం మసాలా,కసూరి మేథీ, పసుపు,ఉప్పు, చెనెగ పిండి వేసి చిన్న మంట మీద మంచి సువాసన వచ్చే వరకు వేయించండి.
  6. *చెనెగ పిండి వేసుకోవటం వలన రుచి తో పాటు కూర చిక్కగా కూడా ఉంటుంది.
  7. ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసి కలపండి.
  8. వేగిన మసాలా లో కచ్చా పచ్చా గా రుబ్బుకున్న టమాటా వేసి కలుపుకొని నూనె తేలే వరకు మూత పెట్టి, మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి.
  9. ఒక 6 నుండి 8 నిమిషాల పాటు మగ్గించుకున్న పిమ్మట అంచుల వెంబడి నూనె తెలటం గమనిస్తారు.ఇప్పుడు మంట చిన్నగా ఉంచి ఉడికించండి.
  10. అలాగే మరో వైపు ఒక మూకుడు పెట్టి ఒక చెంచాడు నెయ్యి వేసుకొని అందులో ఊరేసిన పనీర్ ముక్కలు వేసుకొని టాస్ చేస్తూ రెండు నిమిషాలు వేయించండి.
  11. *ఇలా వేయించటం వలన పనీర్ ముక్కలు కూరలో వేసుకున్న తరువాత కూడా ఎంతో మృదువుగా మరెంతో రుచిగా ఉంటాయి.
  12. టమాటా ఉల్లి మాసాలలో వేయించిన పనీర్ ముక్కలు ,ఒక కప్పు నీళ్లు వేసుకొని మూత పెట్టి చిన్న మంట మీద దెగ్గర పడి నూనె తేలే వరకు అనగా మరొక 15 నిమిషాల పాటు మగ్గించండి.
  13. అంతే ఎంతో రుచిగా ఉండే ఢాబా స్టైల్ పనీర్ మసాలా రెడి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Anitha Rani
Apr-04-2019
Anitha Rani   Apr-04-2019

V.nice recipe

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర