ఇడ్లీలు (ఆలు స్టపింగ్) | Stuffed Idli Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  21st Apr 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Stuffed Idli by Gadige Maheswari at BetterButter
ఇడ్లీలు (ఆలు స్టపింగ్)by Gadige Maheswari
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

ఇడ్లీలు (ఆలు స్టపింగ్) వంటకం

ఇడ్లీలు (ఆలు స్టపింగ్) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Stuffed Idli Recipe in Telugu )

  • ఇడ్లీ రవ 1/4 కెజీ
  • మినపప్పు 1 గ్లాస్ మిడియం సైజుది
  • మెంతులు 1 స్పూన్
  • స్టపింగ్ కోసం :
  • ఉడికించిన ఆలుగడ్డలు 3
  • పచ్చి మిర్చి 3
  • ఉల్లిపాయలు 2
  • జీలకర్ర అర స్పూన్
  • ఆవాలు అర స్పూన్
  • కరివేపాకు కొద్దిగా
  • కోత్తీమీర తరుగు ఒక కప్పు
  • పసుపు అర స్పూన్
  • నూనె 1/2 కప్పు
  • ఉప్పు తగినంత
  • సోడా అర స్పూన్

ఇడ్లీలు (ఆలు స్టపింగ్) | How to make Stuffed Idli Recipe in Telugu

  1. మినపప్పులో మెంతులు వేసి 4 లేదా 5 గంటలు నానబెట్టి రుబ్బుకోవాలి.
  2. ఇడ్లీ రవను బాగా కడిగి రుబ్బుకున్న పిండిలో కలిపి పెట్టుకోవాలి. నేను పిండిని రాత్రంతా నానబెట్టాను.
  3. ఉల్లిపాయలు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
  4. ఒక పాన్ లో 2 స్పూన్ నూనె వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి వేయించాలి.
  5. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించికోవాలి
  6. ఇందులో ఉడికించిన ఆలుగడ్డలు మెదిపి వేసి తగినంత ఉప్పు పసుపు కోత్తీమీర తరుగు వేసి వేయించి పెట్టుకోవాలి
  7. ఇది చల్లారిన తర్వాత వీటిని చిన్న వుండగా వోత్తుకొని పలుచగా చేసుకోవాలి
  8. ఇడ్లీ పిండిలో ఉప్పు సోడా వేసి కలుపుకోవాలి
  9. ఇడ్లీ ప్లేట్ కు నూనె రాసి కొంచెము పిండి వేసి దానిలో మనం తయారు చేసిన ఆలుగడ్డ మిశ్రమ ఉంచి దానిపైన మరికొంచెం ఇడ్లీ పిండి వేసి దానిని ఆవిరికి ఒక 10 లేదా 15ని ఉడికించాలి.
  10. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసికొని చట్నీ తో సర్వ్ చేసుకోవాలి.

Reviews for Stuffed Idli Recipe in Telugu (0)