హోమ్ / వంటకాలు / ఇడ్లీలు (ఆలు స్టపింగ్)

Photo of Stuffed Idli by Gadige Maheswari  at BetterButter
317
0
0.0(0)
0

ఇడ్లీలు (ఆలు స్టపింగ్)

Apr-21-2019
Gadige Maheswari
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇడ్లీలు (ఆలు స్టపింగ్) రెసిపీ గురించి

ఆలుగడ్డలను ఉడికించి కర్రీ చేసి దానిని ఇడ్లీ పిండిలో పెట్టి చేసింది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. ఇడ్లీ రవ 1/4 కెజీ
  2. మినపప్పు 1 గ్లాస్ మిడియం సైజుది
  3. మెంతులు 1 స్పూన్
  4. స్టపింగ్ కోసం :
  5. ఉడికించిన ఆలుగడ్డలు 3
  6. పచ్చి మిర్చి 3
  7. ఉల్లిపాయలు 2
  8. జీలకర్ర అర స్పూన్
  9. ఆవాలు అర స్పూన్
  10. కరివేపాకు కొద్దిగా
  11. కోత్తీమీర తరుగు ఒక కప్పు
  12. పసుపు అర స్పూన్
  13. నూనె 1/2 కప్పు
  14. ఉప్పు తగినంత
  15. సోడా అర స్పూన్

సూచనలు

  1. మినపప్పులో మెంతులు వేసి 4 లేదా 5 గంటలు నానబెట్టి రుబ్బుకోవాలి.
  2. ఇడ్లీ రవను బాగా కడిగి రుబ్బుకున్న పిండిలో కలిపి పెట్టుకోవాలి. నేను పిండిని రాత్రంతా నానబెట్టాను.
  3. ఉల్లిపాయలు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
  4. ఒక పాన్ లో 2 స్పూన్ నూనె వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి వేయించాలి.
  5. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించికోవాలి
  6. ఇందులో ఉడికించిన ఆలుగడ్డలు మెదిపి వేసి తగినంత ఉప్పు పసుపు కోత్తీమీర తరుగు వేసి వేయించి పెట్టుకోవాలి
  7. ఇది చల్లారిన తర్వాత వీటిని చిన్న వుండగా వోత్తుకొని పలుచగా చేసుకోవాలి
  8. ఇడ్లీ పిండిలో ఉప్పు సోడా వేసి కలుపుకోవాలి
  9. ఇడ్లీ ప్లేట్ కు నూనె రాసి కొంచెము పిండి వేసి దానిలో మనం తయారు చేసిన ఆలుగడ్డ మిశ్రమ ఉంచి దానిపైన మరికొంచెం ఇడ్లీ పిండి వేసి దానిని ఆవిరికి ఒక 10 లేదా 15ని ఉడికించాలి.
  10. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసికొని చట్నీ తో సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర