మటన్ బిర్యానీ | Mutton Biryani Recipe in Telugu

ద్వారా Shabnam Khan  |  3rd Sep 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Mutton Biryani by Shabnam Khan at BetterButter
మటన్ బిర్యానీby Shabnam Khan
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  60

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

363

0

మటన్ బిర్యానీ వంటకం

మటన్ బిర్యానీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mutton Biryani Recipe in Telugu )

 • ఉప్పు రుచికి తగినంత
 • 2 చెంచాలు నిమ్మరసం
 • వంట నూనె/నెయ్యి తగినంత
 • అల్లం- వెల్లుల్లి ముద్దా 1 పెద్ద చెంచా
 • 1 కప్పు పెరుగు ఊరవెయ్యడానికి
 • కొత్తిమీర మరియు పుదీనా ఆకులు - చేతి నిండా
 • 1 చెంచా షాజీరా
 • మసాల దినుసులు- బిర్యానీ ఆకు(1) యాలక్కాయలు (2) లవంగాలు (5) దాల్చిని (1 ముక్క)
 • జీలకర్ర పొడి 1 చెంచా
 • ధనియా పొడి 1 చెంచా
 • 1-2 టమోటాలు
 • 4 ఉల్లిపాయలు
 • 3 కప్పుల బాస్మతీ బియ్యం
 • 500 గ్రాములు మటన్

మటన్ బిర్యానీ | How to make Mutton Biryani Recipe in Telugu

 1. ఊరవేయడానికి, పెరుగు, ఉప్పు, పసుపు, ఎండు కారం మరియు అల్లం- వెల్లుల్లి ముద్దని ఒక గిన్నెలో కలపండి. తర్వాత మటన్ ముక్కలని కలిపి దానిని 1-2 గంటలు ఊరవెయ్యండి.
 2. ఈలోగా బాస్మతీ బియ్యాన్ని దాదాపు 30 నిమిషాల పాటు నానబెట్టండి. (ఇది బియ్యం పొడుగుగా మరియు వండిన తర్వాత ఉబ్బెలా చేస్తుంది.)
 3. ఊరవెయ్యడం పూర్తి అయిన తర్వాత, ప్రషర్ కుక్కర్ తీసుకుని నూనెని వేయండి. బిర్యానీ ఆకులు, దాల్చిని, లవంగాలు వేసి కొన్ని సెకన్ల తర్వాత తరిగిన లేదా రుబ్బిన ఉల్లిపాయల్ని వేయండి. ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారాక, అల్లం-వెల్లుల్లి ముద్దని వేయండి, రుచికి తగినంత ఉప్పు, పసుపు మరియు కారం పొడి, కొత్తిమీర మరియు జీలకర్ర పొడిని మరికొంత వేయండి.
 4. పదార్థాలను బాగా కలపండి. మసాలాలో నూనె బయటికి రావడం మొదలయ్యాక, ఊరిన మటన్ వేయండి. కొంత పుదీనా మరియు కొత్తిమీరని సువాసన కోసం వేయండి.
 5. 1/4 గ్లాసు నీళ్ళు పోసి మూతని మూయండి. ప్రషర్ కుక్ లో 5 విజల్స్ రానీయండి.
 6. మరొక వైపు, బియ్యం వండడానికి కుండ తీసుకుని నీరు ఉడికించండి. కొంచెం షాజీరా, యాలకులు మరియు మేస్ ని మంచి రుచి కోసం బిర్యానీ బియ్యంలో వేయండి. ( బియ్యం 70 శాతం ఉడకాలి ఎందుకంటే మిగిలినది ధమ్ సమయంలో ఉడకాలి.)
 7. వేరే ప్యానులో, కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేయించి ప్రక్కన పెట్టండి.
 8. చివరగా పొరల కోసం, నూనె లేదా నెయ్యితో పూసిన బిర్యాని కకుండని తీసుకోండి. వండిన మటన్ మరియు అన్నం పొరలలో వేయండి. పైన పొరలో, వేయించిన ఉల్లిపాయాలు, కొత్తిమీర, పుదీనా వేసి, సగం నిమ్మకాయ పిండండి, దానిని అన్నం పొర అంతటా పైన పరవండి.
 9. దానిని 20 నిమిషాలు ఉడికించండి. బిర్యానీ సిద్ధం!

నా చిట్కా:

నూనె కి బదులు నెయ్యి వాడండి. పొరలు వేసేటప్పుడు సరిపడా గ్రేవీ ఉండేలా మటన్ కూర ని చుసుకొండి. బిర్యానీ కుండ మీద భారీ మూత లేదా మూత మీద భారీ వస్తువు ఏదైనా పెట్టడం మరియు తక్కువ మంట మీద పెట్టి మూయడం చాలా ముఖ్యం. ఇది చేయాలి అప్పుడు ధమ్ చేస్తున్నప్పుడు కుండ మీదుగా గాలి పోదు.

Reviews for Mutton Biryani Recipe in Telugu (0)