BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మటన్ బిర్యానీ

Photo of Mutton Biryani by Shabnam Khan at BetterButter
4
75
0(0)
0

మటన్ బిర్యానీ

Sep-03-2016
Shabnam Khan
30 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మటన్ బిర్యానీ రెసిపీ గురించి

రుచిగా ఉండే హైదరాబాదీ మటన్ ధమ్ బిర్యానీ.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఈద్
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఆవిరికి
  • మితముగా వేయించుట

కావలసినవి సర్వింగ: 2

  1. 500 గ్రాములు మటన్
  2. 3 కప్పుల బాస్మతీ బియ్యం
  3. 4 ఉల్లిపాయలు
  4. 1-2 టమోటాలు
  5. ధనియా పొడి 1 చెంచా
  6. జీలకర్ర పొడి 1 చెంచా
  7. మసాల దినుసులు- బిర్యానీ ఆకు(1) యాలక్కాయలు (2) లవంగాలు (5) దాల్చిని (1 ముక్క)
  8. 1 చెంచా షాజీరా
  9. కొత్తిమీర మరియు పుదీనా ఆకులు - చేతి నిండా
  10. 1 కప్పు పెరుగు ఊరవెయ్యడానికి
  11. అల్లం- వెల్లుల్లి ముద్దా 1 పెద్ద చెంచా
  12. వంట నూనె/నెయ్యి తగినంత
  13. 2 చెంచాలు నిమ్మరసం
  14. ఉప్పు రుచికి తగినంత

సూచనలు

  1. ఊరవేయడానికి, పెరుగు, ఉప్పు, పసుపు, ఎండు కారం మరియు అల్లం- వెల్లుల్లి ముద్దని ఒక గిన్నెలో కలపండి. తర్వాత మటన్ ముక్కలని కలిపి దానిని 1-2 గంటలు ఊరవెయ్యండి.
  2. ఈలోగా బాస్మతీ బియ్యాన్ని దాదాపు 30 నిమిషాల పాటు నానబెట్టండి. (ఇది బియ్యం పొడుగుగా మరియు వండిన తర్వాత ఉబ్బెలా చేస్తుంది.)
  3. ఊరవెయ్యడం పూర్తి అయిన తర్వాత, ప్రషర్ కుక్కర్ తీసుకుని నూనెని వేయండి. బిర్యానీ ఆకులు, దాల్చిని, లవంగాలు వేసి కొన్ని సెకన్ల తర్వాత తరిగిన లేదా రుబ్బిన ఉల్లిపాయల్ని వేయండి. ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారాక, అల్లం-వెల్లుల్లి ముద్దని వేయండి, రుచికి తగినంత ఉప్పు, పసుపు మరియు కారం పొడి, కొత్తిమీర మరియు జీలకర్ర పొడిని మరికొంత వేయండి.
  4. పదార్థాలను బాగా కలపండి. మసాలాలో నూనె బయటికి రావడం మొదలయ్యాక, ఊరిన మటన్ వేయండి. కొంత పుదీనా మరియు కొత్తిమీరని సువాసన కోసం వేయండి.
  5. 1/4 గ్లాసు నీళ్ళు పోసి మూతని మూయండి. ప్రషర్ కుక్ లో 5 విజల్స్ రానీయండి.
  6. మరొక వైపు, బియ్యం వండడానికి కుండ తీసుకుని నీరు ఉడికించండి. కొంచెం షాజీరా, యాలకులు మరియు మేస్ ని మంచి రుచి కోసం బిర్యానీ బియ్యంలో వేయండి. ( బియ్యం 70 శాతం ఉడకాలి ఎందుకంటే మిగిలినది ధమ్ సమయంలో ఉడకాలి.)
  7. వేరే ప్యానులో, కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేయించి ప్రక్కన పెట్టండి.
  8. చివరగా పొరల కోసం, నూనె లేదా నెయ్యితో పూసిన బిర్యాని కకుండని తీసుకోండి. వండిన మటన్ మరియు అన్నం పొరలలో వేయండి. పైన పొరలో, వేయించిన ఉల్లిపాయాలు, కొత్తిమీర, పుదీనా వేసి, సగం నిమ్మకాయ పిండండి, దానిని అన్నం పొర అంతటా పైన పరవండి.
  9. దానిని 20 నిమిషాలు ఉడికించండి. బిర్యానీ సిద్ధం!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర