వెజ్ ధమ్ బిర్యానీ | Veg Dum Biryani Recipe in Telugu

ద్వారా Moumita Malla  |  9th Sep 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Veg Dum Biryani by Moumita Malla at BetterButter
వెజ్ ధమ్ బిర్యానీby Moumita Malla
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

355

0

వెజ్ ధమ్ బిర్యానీ

వెజ్ ధమ్ బిర్యానీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg Dum Biryani Recipe in Telugu )

 • కూరగాయల కూరకి పదార్థాలు:
 • క్యారెట్లు-2, తరిగినవి
 • క్యాలీఫ్లవర్ పువ్వులు- 10 (చిన్నవి)
 • బటన్ పుట్టగొడుగులు-6 (తరిగినవి)
 • ఫ్రంచ్ బీన్స్-1/2 కప్పు (తరిగినవి)
 • పచ్చి బఠాణీలు - 1/2 కప్పు
 • పన్నీరు- 1 కప్పు ( మధ్యస్థ పరిమాణ క్యూబు లో కోసినవి)
 • పెరుగు-1/4 కప్పు
 • ఉల్లిపాయలు-2, తరిగినవి
 • అల్లం ముద్ద- 1 పెద్ద చెంచా
 • వెల్లుల్లి ముద్ద- 2 పెద్ద చెంచాలు
 • పసుపు- 1 చెంచా
 • ధనియా పొడి- 1 చెంచా
 • ఎర్ర కారం- 1 చెంచా
 • దాల్చిన చెక్క- 1
 • పచ్చ యాలకులు-3
 • లవంగాలు-4
 • బిర్యానీ ఆకులు-2
 • జీలకర్ర-1/2 చెంచా
 • గరం మసాలా పొడి-1 చెంచా
 • ఉప్పు రుచికి తగినంత
 • చక్కెర- 1/2 చెంచా
 • నూనె/నెయ్యి/క్లారిఫిడ్ వెన్న- 2 పెద్ద చెంచాలు+2 చెంచాలు
 • బిర్యానీ మసాలాకు పదార్థాలు:
 • దాల్చిన చెక్క- 1
 • పచ్చ యాలకులు-4
 • నల్ల యాలకులు-3
 • లవంగాలు-5
 • నల్ల మిరియాలు-3
 • నక్షత్ర సోంపు-1
 • జాజికాయ-1/2
 • జాపత్రి-1/2/ చెంచా
 • షా జీరా-1 చెంచా
 • ధనియాలు- 1 చెంచా
 • కబాబ్ చిని-1/2 చెంచా
 • బిర్యానీ అన్నానికి పదార్థాలు:
 • బాస్మతీ బియ్యం-2 కప్పులు ( నీటిలో 15 నిమిషాలు నానబెట్టినవి)
 • నీళ్ళు- 4 కప్పులు
 • పచ్చ యాలకులు-3
 • నల్ల యాలకులు-3
 • లవంగాలు-4
 • దాల్చిన చెక్క- 1 అంగుళం
 • నక్షత్ర సోంపు- 1
 • నూనె- 2 చెంచాలు
 • ఉప్పు రుచికి తగినంత
 • కుంకుమ పువ్వు-1 చిటికెడు, 1 కప్పు వెచ్చని పాలలో నానవేసినది
 • గులాబి నీరు- 2 చెంచాలు
 • కేవ్రా ఎసెన్స్- 4 చుక్కలు
 • అలంకరణకు పదార్థాలు:
 • వేయించిన ఉల్లిపాయలు లేదా బిరిస్తా- 2 ఉల్లిపాయల్ని చీల్చు, తర్వాత చీలికలని విడదీసి వేయించండి

వెజ్ ధమ్ బిర్యానీ | How to make Veg Dum Biryani Recipe in Telugu

 1. బిర్యానీ మసాలాని సిద్ధం చేయడానికి, అన్ని మసాల దినుసుల పొడులని ప్యానులో వేయించి, అప్పుడు వాటిని చల్లార్చి బాగా పొడిగా కావడానికి రుబ్బండి.
 2. బిర్యానీ అన్నం తయారీకి, పెద్ద ప్యానుని తీసుకుని, నీళ్ళు 4 కప్పులు పోసి, దానిలో బిర్యానీ ఆకు, నూనె, ఉప్పు వేయండి. దానిని ఉడికించండి, నీళ్ళు ఉడకడం మొదలయ్యాక, బియ్యం వేసి, బియ్యాన్ని 3/4 వంతు అయ్యేవరకు వండండి.
 3. దానిని ఉడికించండి, నీళ్ళు ఉడకడం మొదలయ్యాక, బియ్యం వేసి, బియ్యాన్ని 3/4 వంతు అయ్యేవరకు వండండి. అప్పుడు వడకట్టి మరియు అన్నాన్ని ట్రేలోకి విస్తరింపచేయండి.
 4. చివరి తయారీకి, నాస్-స్టిక్ లేదా భారీ మందపాటి గిన్నెలో నెయ్యి/నూనె వేడి చేయండి. (గిన్నె చాలా పెద్దగా ఉండాలి అందువల్ల మీదు మీ బిర్యానీని ఆ గిన్నెలో తర్వాత వందగలరు.)
 5. దానిలో తరిగిన ఉల్లిపాయలు వేసి అవి బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించండి. అన్ని కూరగాయలు, పన్నీరు వేసి ఉప్పు కొంచెం వేయండి. దానిని 2 నిమిషాలు ఉడికించండి.
 6. అల్లం-వెల్లుల్లి ముద్ద, బిర్యానీ మసాలాని పెరుగుతో కలపండి, తర్వాత బాగా కలిపి దాన్ని ప్యానులోకి వేయండి. దీనిని కూరగాయలతో కలిపి దానిని 2 నిమిషాలు వండండి.
 7. తర్వాత దానిలోకి వండిన అన్నాని వేయండి, అన్నం మరియు కూరగాయల పొర మధ్యలో రంధ్రం పెట్టి దానిలో కుంకుమ పువ్వు కలిగిన పాలను దానిమీద పోయండి.
 8. దానిమీద కొంచెం ఉప్పు, మిగిలిన గరం మసాలా, వేయించిన ఉల్లిపాయలు, కీవ్రా ఎసెన్స్, గులాబీ నీరు మరియు 1 చెంచా నెయ్యి వేయండి.
 9. ప్యానుని అల్యూమినియం ఫాయిల్ తో మూసి, తర్వాత పైన మూతని పెట్టండి.
 10. 2- 3 నిమిషాలు తక్కువ మంటలో వండండి, తర్వాత గ్యాసుని ఆపేయండి. దానిని 10 నిమిషాలు వదిలేయండి.
 11. రైతాతో వెజ్ బిర్యాని వడ్డించడానికి సిద్ధం.

నా చిట్కా:

మీరు కూరగాయలను చికెన్, మటన్ లేదా గుడ్డు వంటి నాన్-వెజ్ పదార్థాలతో మార్చుకోవచ్చు.

Reviews for Veg Dum Biryani Recipe in Telugu (0)