ఎండలో ఎండబెట్టిన బంగాళదుంప చిప్స్ | Sun dried Potato Chips Recipe in Telugu

ద్వారా Rita Arora  |  6th Oct 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Sun dried Potato Chips by Rita Arora at BetterButter
ఎండలో ఎండబెట్టిన బంగాళదుంప చిప్స్by Rita Arora
 • తయారీకి సమయం

  24

  గంటలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

300

0

ఎండలో ఎండబెట్టిన బంగాళదుంప చిప్స్ వంటకం

ఎండలో ఎండబెట్టిన బంగాళదుంప చిప్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sun dried Potato Chips Recipe in Telugu )

 • బంగాళదుంపలు మీకు కావలసినన్ని
 • నీళ్ళు కావలసినన్ని
 • ఉప్పు తగినంత
 • నూనె బాగా వేయించడానికి లేదా పైపైన వేయించడానికి
 • అవసరమైనంత నల్ల ఉప్పు
 • చల్లడానికి ఎండు కారం

ఎండలో ఎండబెట్టిన బంగాళదుంప చిప్స్ | How to make Sun dried Potato Chips Recipe in Telugu

 1. నీళ్ళలో బంగాళదుంపలని బాగా కడగండి. పెద్ద గిన్నెలో బంగాళదుంపలను తొక్కతీయండి, నీళ్ళులో కొంచెం ఉప్పు కలిపి ప్రక్కను పెట్టండి. స్లైసర్ తో బంగాళదుంపలను తరగడం మొదలు పెట్టండి మరియు మీరు పల్చగా తరిగేటప్పుడు ముక్కలని ఉప్పు నీళ్ళలో పడేలా చూడండి.
 2. పల్చటి ముక్కలు బాగా మందంగా లేదా బాగా పల్చగా ఉండకూడదు. మనం ముక్కలని ఉప్పు నీళ్ళలో వేస్తున్నాం అందువల్ల బంగాళదుంపలు రంగు మారవు.
 3. ఇప్పుడు మరొక పెద్ద గిన్నెలో నీళ్ళు తీసుకుని ఉప్పు వేయండి. నీటి పరిమాణం తప్పనిసరిగా బంగాళదుంప ముక్కలు అన్నీ మునిగేలా ఉండాలి. ఈ ఉప్పు నీటి మిశ్రమాన్ని అధిక మంట మీద బాగా మరలనివ్వండి. ఇప్పుడు వేడి ఉప్పు నీళ్ళలో బంగాళదుంప ముక్కలని వేయండి. వేడి మరలిన నీళ్ళలో 2-3 నిమిషాలు బంగాళదుంప ముక్కలని తెల్లపరచండి. మంటని తగ్గించకండి, 3 లేదా 4 నిమిషాల తర్వాత, మంటని ఆపేయండి. ముక్కలు అపారదర్శకంగా కనిపించాలి అప్పుడు ముక్కల్ని జల్లెడలో వడకట్టండి.
 4. శుభ్రమైన ప్లాస్టిక్ షీట్తో వాటిని వరుసగా ట్రేలో అమర్చండి లేదా వాటిని పళ్ళెంలో లేదా ట్రేలో పెట్టేయండి. అవి పూర్తిగా ఎండేదాకా 1 లేదా 2 రోజులు ఎండలో పెట్టండి. వాటిలోకి దుమ్ము చేరకుండా వాటిని మస్లిన్ గుడ్డతో మూయండి.
 5. మీరు వాటిని నీడ పడే స్థలంలో కూడా పెట్టవచ్చు, మీరు సూర్యకాంతిని పొందకపోతే, ఒక వైపు ఎండాక ముక్కల యొక్క భాగాన్ని మార్చండి. గాలి చొరని డబ్బాలో చల్లని లేదా పొడి ప్రదేశంలో నిల్వ చేయండి.
 6. వడ్డించడానికి:
 7. లోతులేని లేదా లోతుగా బంగాళదుంప ముక్కల్ని వేయించండి. వడ్డించే ముందు కొంచెం ఉప్పు మరియు ఎర్ర కారం పొడి చల్లండి. వేడిగా బంగాళదుంప చిప్స్ ని వడ్డించండి.

Reviews for Sun dried Potato Chips Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo