హోల్ వీట్ ఎగ్లెస్ చాకొలేట్ కేక్ రెసిపీ | Whole Wheat Eggless Chocolate Cake Recipe Recipe in Telugu

ద్వారా Jolly Homemade Recipes  |  16th Sep 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Whole Wheat Eggless Chocolate Cake Recipe recipe in Telugu,హోల్ వీట్ ఎగ్లెస్ చాకొలేట్ కేక్ రెసిపీ , Jolly Homemade Recipes
హోల్ వీట్ ఎగ్లెస్ చాకొలేట్ కేక్ రెసిపీ by Jolly Homemade Recipes
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  60

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1608

0

హోల్ వీట్ ఎగ్లెస్ చాకొలేట్ కేక్ రెసిపీ వంటకం

హోల్ వీట్ ఎగ్లెస్ చాకొలేట్ కేక్ రెసిపీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Whole Wheat Eggless Chocolate Cake Recipe Recipe in Telugu )

 • గోధుమ పిండి/ఆటా- 1.5 కప్పులు
 • మంచి కోకోవా పొడి- 1/4 కప్పు
 • బేకింగ్ పొడి - 1 చెంచా
 • బేకింగ్ సోడా లేదా కుకింగ్ సోడా - 3/4 కప్పు
 • ఉప్పు- ఒక చిటికెడు
 • చక్కర పొడి- 1 కప్పు
 • తాజాగా పిండిన నిమ్మరసం- 1 చెంచా
 • వెజిటబుల్ నూనె -1/3 కప్పు
 • వేడి నీళ్ళు- 1 కప్పు
 • మంచి నాణ్యమైన వెనీలా ఎక్స్ట్రాక్ట్ లేదా పొడి- 1 చెంచా
 • తీపి కోకో పొడి- 1 చెంచా చల్లడానికి

హోల్ వీట్ ఎగ్లెస్ చాకొలేట్ కేక్ రెసిపీ | How to make Whole Wheat Eggless Chocolate Cake Recipe Recipe in Telugu

 1. మీరు మొదలు పెట్టే ముందు, మీ ఓవెన్ని 170 డిగ్రీల సెల్సియస్ వద్ద ముందుగా వేడి చేసుకోండి మరియు కేక్ టిన్ ని కొంచెం వెన్నని అడుగున మరియు టిన్ యొక్క లోపలి అంచులకి సమానంగా రాయండి.
 2. టిన్ లోపల కొంచెం పిండిని చల్లండి అది మీ కేకు, కేక్ టిన్ నుండి మెల్లిగా బయటికి రావడానికి మరియు మాడకుండా ఉండడానికి కూడా సహాయపడుతుంది.
 3. అన్ని పొడి పదార్థాలను తీసుకుని, బాగా జల్లించి మరియు వాటిని కలపండి. మీరు ద్రవ పిండిని చిలుకుకునే లోపు, దానిని ప్రక్కకు పెట్టండి.
 4. శుభ్రమైన గిన్నెలో వేడి నీళ్ళుపోసి, చక్కెర పొడి, నూనె మరియు నిమ్మరసం పోయండి. బాగా కలపండి, వెనీలా ఎస్సెన్స్ వేసి మళ్ళీ కొన్ని నిమిషాలు కలపండి అన్ని పదార్థాలు బాగా కలిసేలా కలపండి.
 5. ఇప్పుడు మెల్లిగా మరియు జాగ్రత్తగా, పొడి మిశ్రమంలోకి ద్రవ పిండిని, కొద్దికొద్దిగా వేయండి. ఏవైనా బుడగలు రాకుండా నివారణకు బాగా కలుపుతూ ఉండండి.
 6. త్వరలో, మీకు ముదురు రంగులో, బాగా మందంగా, పిచ్చిగా కనిపించే పిండి వస్తుంది. పిండి ఎంత చెత్తగా కనిపించినా ఫర్వాలేదు, చివరగా బయటకు వచ్చే మంచి పరిమాణాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు.
 7. సిద్ధం చేసిన కేకు టిన్ లో కేక్ పిండిని పోయండి. అంచులు తట్టండి అందువల్ల దాగిన గాలి బుడగలు పోతాయి.
 8. ముందుగా వేడి చేసిన ఓవెన్ లో 30 నుండి 35 నిమిషాలు వరకు 170 డిగ్రీల సెల్సియస్ వద్ద కేక్ ను బేక్ చేయండి. టూత్ పిక్ తీసుకుని, దానిని కేక్ లో గుచ్చండి, అది శుభ్రంగా బయటకు వస్తే దాని అర్థం మీ కేసు సిద్ధం అయ్యింది మరియు లేకపోతే, మీరు దానిని మరికొన్ని నిమిషాలు వండండి.
 9. కేకుని టిన్ లో 5 నిమిషాలు ఉండనివ్వండి, తర్వాత అంచు వెంబడి కత్తిని మెల్లిగా తిప్పండి, చల్లబడడానికి కేకుని వైర్ ర్యాక్ మీదకు తిప్పండి. తీపి కోకో పొడి తో చల్లి వడ్డించండి.

నా చిట్కా:

ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ నన్ను నమ్మండి ఇది సులభం మరియు ఆరోగ్యం కూడా...ఎందుకంటే ఇది గుడ్లులేనిది మరియు వెన్నలేని కేస్ రెసిపీ.

Reviews for Whole Wheat Eggless Chocolate Cake Recipe Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo