హోమ్ / వంటకాలు / చికెన్ 65

Photo of Chicken 65 by Sara Ibrahim at BetterButter
7076
51
5.0(0)
0

చికెన్ 65

Sep-22-2015
Sara Ibrahim
0 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • రాత్రి విందు
  • కేరళ
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. చికెన్- 500 గ్రాములు
  2. ఎర్ర కారం పొడి - 3 పెద్ద చెంచాలు
  3. పసుపు పొడి - 1 చెంచా
  4. నిమ్మరసం - 1 పెద్ద చెంచా
  5. టొమాటో ముద్ద - 1/3 కప్పు
  6. టొమాటో కెచప్- 1/3 కప్పు
  7. పెరుగు - 2 పెద్ద చెంచాలు
  8. ఉప్పు రుచికి తగినంత
  9. పచ్చి మిరపకాయలు - 2 లేదా 3
  10. కరివేపాకు - 10
  11. గరం మసాలా చిటికెడు
  12. వెన్న - 3 పెద్ద చెంచాలు
  13. చక్కర చిటికెడు

సూచనలు

  1. 3 పెద్ద చెంచాల ఎండు కారం, 1 చెంచా పసుపు, కొంచెం ఉప్పు మరియు 1 పెద్ద చెంచా నిమ్మరసంతో చికెనుని ఊరబెట్టండి.
  2. 30 నిమిషాల నుండి 2 గంటల వరకు ప్రక్కన పెట్టండి. సాధారణంగా చికెన్ మృదువుగా అవ్వడానికి 45 నిమిషాలు బాగా పనిచేస్తుంది (తొందరలో). చికెనుని వేయించండి.
  3. టొమాటో ముద్దను, కెచేప్ మరియు పెరుగుని రుబ్బి టొమాటో గ్రేవీని సిద్ధం చేయండి,
  4. ప్యాను తీసుకుని 3 పెద్ద చెంచాల వెన్నని వేయండి. 2 నిమిషాల పాటు కరివేపాకు మరియు పచ్చిమిర్చిని వేగనివ్వండి.
  5. టొమాటో గ్రేవీని కలపండి. దానిని 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి.
  6. వేయించిన చికెన్ ముక్కలను జోడించండి. మూతని మూసి తక్కువ మంటలో 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి.
  7. కొంచెం గరం మసాలా, చక్కర మరియు ఉప్పుని కలపండి. మూతని మూసి తక్కువ మంటలో మరొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి.
  8. మీ ఎంపిక ఆధారంగా మీరు పూర్తిగా పొడిగా చేయవచ్చు లేదా కొంచెం గ్రేవీ ఉంచుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర