బెంగాలీ చేప కూర | Bengali Fish Fry Recipe in Telugu

ద్వారా Satabdi Mukherjee  |  7th Dec 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Bengali Fish Fry by Satabdi Mukherjee at BetterButter
బెంగాలీ చేప కూరby Satabdi Mukherjee
 • తయారీకి సమయం

  2

  గంటలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

323

0

బెంగాలీ చేప కూర

బెంగాలీ చేప కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bengali Fish Fry Recipe in Telugu )

 • బెట్కీ లేదా సాలమన్ లేదా బాసా లేదా ఏదైనా తెల్ల చేప ఎముకలు లేని తంతువులు - 4 పెద్ద పరిమాణం
 • ఉల్లిపాయ ముద్ద - 1 చెంచా
 • అల్లం ముద్ద - 1 చెంచా
 • పచ్చిమిర్చి ముద్ద - 1 చెంచా
 • కొట్టిమీర ముద్ద - 1/4 కప్పు
 • నిమ్మరసం - 1 పెద్ద చెంచా
 • మిరియాల పొడి - 1/2 చెంచా
 • ఉప్పు రుచికి సరిపడా
 • గుడ్డు- 1
 • మొక్కజొన్న పిండి - 1/2 కప్పు
 • బ్రడ్ క్రంప్- 1/2 కప్పు
 • దానితో వడ్డించడానికి నిమ్మకాయ చెక్కలు
 • నల్ల ఉప్పు- చిటికెడు
 • నూనె- బాగా వేయించడానికి

బెంగాలీ చేప కూర | How to make Bengali Fish Fry Recipe in Telugu

 1. మొదట చేప ఫిల్లెట్లను నీటితో కడగాలి. మరియు దాన్ని వంటిటి బట్టతో పొడిగా తుడవాలి.
 2. చేప ఫిల్లేట్ ను ఉల్లిపాయ ముద్ద, అల్లం ముద్ద, వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, పచ్చిమిర్చి ముద్ద, కొత్తిమీర ముద్ద మరియు ఉప్పుతో ఊరబెట్టాలి.
 3. మూసేసి దాన్ని ఫ్రిజ్లో గంటన్నర పాటు పెట్టాలి.
 4. గంటన్నర తర్వాత ఊరిన చేపని ఫ్రిజ్ లో నుండి బయటికి తీసి ప్రక్కకు పెట్టాలి.
 5. గుడ్డుని బీట్ చేయాలి మరియు చదునైన గిన్నె మీద పోయాలి. అంతేకాక చదునైన గిన్నె మీద మొక్కజొన్న పిండి మరియు బ్రెడ్ క్రంస్ విడివిడిగా పెట్టాలి.
 6. ఊరిన చేపని మొదట పొడి మొక్కజొన్న పిండితో మరియు చిలక్కొట్టిన గుడ్డుతో మరియు చివరగా బ్రాడ్ క్రంస్తో పూత పూయాలి. ఈ పద్ధతిని అన్ని చేప ఫిల్లెట్లకు చేయలి.
 7. దాన్ని మూయాలి మరియు దాన్ని మళ్ళీ మరొక అర్థగంట ఫ్రిజ్ లో పెట్టాలి.
 8. లోతైన గిన్నెలో సరిపడా నూనెని వేడి చేయాలి. పూత పూసిన చేప ఫిల్లెట్లని బయటికి తీసి దానిని ఒక దాని తర్వాత ఒకటి బాగా వేయించండి.
 9. కిచెన్ టవల్ మీదకి తీసి అధికంగా ఉన్న నూనెని తీసేయండి.
 10. నల్ల ఉప్పుని జల్లండి మరియు దీనిని నిమ్మ చెక్కలతో వడ్డించండి.

Reviews for Bengali Fish Fry Recipe in Telugu (0)