కడాయి పనీర్ | Kadai Paneer Recipe in Telugu

ద్వారా Sagarika Sudharshan  |  4th Oct 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Kadai Paneer by Sagarika Sudharshan at BetterButter
కడాయి పనీర్ by Sagarika Sudharshan
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1657

0

కడాయి పనీర్ వంటకం

కడాయి పనీర్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kadai Paneer Recipe in Telugu )

 • నూనే 3 పెద్ద చెంచాలు
 • రుచికి తగినంత ఉప్పు
 • గుప్పెడంత కొత్తిమీర ఆకులు
 • కసూరి మేతి 1/2 చెంచా
 • గరం మసాలా 1 చెంచా
 • కాశ్మీరీ కారం రుచికి తగినంత
 • తాజాగా ఉన్న క్రీం 1/3 కప్పు
 • జీడిపప్పులు 10 (ఇష్ట అయితేనే అవసరం కాదు)
 • ధనియాలు 3 చెంచాలు
 • కాశ్మీరీ ఎర్రమిర్చి 6 ( రుచికి తగ్గటు)
 • అల్లం వెల్లుల్లి పేస్టు 1 చెంచా
 • మధ్యస్తంగా ఉన్న కాప్సికం 2( నేను పచ్చడి మరియు ఆకుపచ్చది ఇక్కడ వాడను)
 • ఎర్ర టమాటాలు 4
 • పెద్ద ఉల్లిపాయలు 2
 • పనీర్ 2 కప్పుడు తరిగిన

కడాయి పనీర్ | How to make Kadai Paneer Recipe in Telugu

 1. ధనియాలు మరియు ఎండుమిర్చిని పొడిగా మంచి వాసనా వచ్చేదాకా వేయించాలి, స్టవ్ ఆపేసి మిక్సి పటాలి.
 2. 10 నిమిషాల పాటు జిడిపప్పులను నీళ్ళలో నానబెట్టి మెత్తని పేస్టుగా రుబ్బాలి.( ఒకవేళ మీరు జీడిపప్పు పేస్టు వెయ్యాలి అనుకుంటే ఈ స్టెప్ ని అనుసరించండి, లేదంటే అక్కర్లేదు)
 3. ఒక పెద్ద ఉల్లిపాయ ని పేస్టుగా పట్టి, పక్కన పెట్టుకోవాలి.
 4. టమాటలను కూడా మెత్తని పేస్టుగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
 5. మిగిలిన పెద్ద ఉల్లిపాయలు, పనీర్ మరియు కాప్సికం ని తరిగి పక్కన పెట్టుకోవాలి.
 6. ఒక పెద్ద చెంచా నూనే ని పాన్ లో వేసి వేడి అయ్యాక పంనేర్ ముక్కలు బంగారు వెన్నులో వచ్చేదాకా వేయించాలి, తరువాత పను నుంచి పక్కకు తీసి పెట్టుకోవాలి.
 7. అదే పాన్ లో ఇంకో చెంచా నూనే వేసి అందులో తరిగిన ఉల్లిపాయలు మరియు కాప్సికం వేసి 5 నిమిషాలపాటు వేయించి తెసేయాలి. దీనివల్ల కూరలో ఈ ముక్కలు కరకరలాడతాయి.
 8. ఇంకో చెంచా నుం కూడా వేసి, ఉల్లిపాయ పేస్టు మరియు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒక నిమిషం పాటు పచ్చి వాసన పోయేదాకా వేయించాలి.
 9. ఇప్పుడు మనం కారం మరియు ధనియాలు పొడిని ఇందులో కలిపి ఒక నిమిషం వేయించాలి.
 10. అందులో టమాట రసం కూడా పాన్ చేసి ఉడికించారు.
 11. అందులో కాస్త నీళ్ళు, కారం , ఉప్పు , గరం మసాలా మరియు జీడిపప్పు పేస్టు. అన్ని కలిపి వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి.
 12. మంటని తగ్గించి అందులో క్రీం వెయ్యాలి. చిక్కని కూరా అయ్యేదాకా వండాలి. - ఇప్పుడు పనీర్, ఉల్లిపాయలు మరియు కాప్సికం వేసి గ్రేవీ లో వెయ్యాలి మరియు ఉడకనివ్వాలి ఇంకో 5 నిమిషాలు, మొత్తం గ్రేవీ కూర ముక్కలకు పనీర్ కి పట్టేంత వరకు.( నీళ్ళను కాస్త కలపాలి).
 13. కసూరి మేతి మరియు బాగా కలపాలి, కొత్తిమీర ఆకులు కూడా చివరలో వేసి స్టవ్ ఆపేయాలి. వేడిగా వడ్డించాలి.

నా చిట్కా:

- జీడిపప్పుల పేస్టు వేయటం అనేది మీ ఇష్టం. - పనీర్ ని వేయించే బదులు వేడి నీళ్ళలో ఒక 30 క్షణాలు ఉంచి గ్రేవీ లో వెయ్యాలి .- నేను ఇందులో ఆరంజ్ కలర్ వేసాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. - క్రీం కి బదులుగా పాలు 1/2 కప్పు వాడచ్చు.

Reviews for Kadai Paneer Recipe in Telugu (0)