హోమ్ / వంటకాలు / ఛోలే భటురా

Photo of Chole Bhature by Anju Bhagnari at BetterButter
6083
111
4.6(0)
1

ఛోలే భటురా

Mar-08-2017
Anju Bhagnari
20 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • పంజాబీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • ఉడికించాలి
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. భటురా కొరకు- 2 కప్పుల మైదా
  2. 1/2 కప్పు పెరుగు (మెత్తని పిండి తడపడానికి సరిపడా)
  3. ఉప్పు రుచికి
  4. 1 చెంచా నూనె
  5. ఛోలే కోసం- 2 కప్పుల కాబూలీ శనగలు
  6. 2 పెద్ద ఉల్లిపాయలు, తరిగినవి
  7. 2 టమోటాలు, తరిగినవి
  8. 1 పచ్చిమిర్చి
  9. 1 చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
  10. 1 చెంచా ఎర్ర కారం పొడి
  11. 1 చెంచా జీలకర్ర పొడి
  12. 1 చెంచా ధనియా పొడి
  13. 1 చెంచా గరం మసాలా పొడి
  14. 1/2 చెంచా పసుపు
  15. 1 చెంచా ఛోలే మసాలా
  16. ఉప్పు రుచికి
  17. నీరు సరిపడా
  18. బాగా వేయించడానికి నూనె
  19. వడ్డించడానికి- తరిగిన నిమ్మకాయ మరియు ఉల్లిపాయ చక్రాలు

సూచనలు

  1. ఛోలే రెసిపీ- రాత్రంతా 2 కప్పుల శనగలు నానబెట్టండి.
  2. తర్వాతి ఉదయం వాటికి ఉప్పు, 1/2 చెంచాఎర్ర కారం పొడి, 1/4 చెంచా పసుపు, 1/2 చెంచా గరం మసాలా కలపండి.
  3. వాటిని 4-5 కప్పుల నీళ్ళలో ప్రషర్ కుక్కర్లో పూర్తి మంట మీద 3 విజల్స్ వరకు ఉడికించండి.
  4. అవి మెత్తగా అవుతాయి మరియు 95% ఉడుకుతాయి.
  5. గ్రేవీ తయారీకి, ప్రషర్ కుక్కరులో 2 పెద్ద చెంచాల నూనె వేడి చేయండి.
  6. దానిలో తరిగిన ఉల్లిపాయల్ని వేయండి.
  7. అవి లేత గోదుమలోకి మారేదాకా 10 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించండి. అప్పుడప్పుడు కలపండి.
  8. 1 చెంచా జీలకర్ర పొడి, ఉప్పు, 1 చెంచా ధనియా పొడి, 1/2 చెంచా గరం మసాలా, 1/2 చెంచా ఎర్ర కారం పొడి, 1 చెంచా ఛోలే మసాలా మరియు 1 చెంచా అల్లమ వెల్లుల్లి ముద్ద వంటి పొడి మసాలాల్ని వేయండి.
  9. 1 నిమిషం వేయించండి మరియు టమోటాలు మరియు పచ్చి మిర్చి దానిలో వేయండి.
  10. టమోటాలు అయ్యాయని అనిపించేదాకా వండండి.
  11. 1 కప్పు నీళ్ళలో వేయండి.
  12. పూర్తి మంట మీద 1 విజల్ వరకు ప్రషర్ కుక్ చేయండి.
  13. ఆవిరి పోయాక, గ్రేవీని చేతి బ్లెండర్తో రుబ్బండి.
  14. అది ఇలా కనపడుతుంది.
  15. ఉడికిన చోలేలో కలపండి మరియు దాదాపు 10 నిమిషాల వరకు మూత తీసి చిన్న మంట మీద పెట్టి కొంచెం కలపండి.
  16. 1 కప్పు నీళ్ళను వేయండి మరియు 1 విజల్ వరకు ప్రషర్ కుక్ చేయండి అందువల్ల ఛోలే గ్రేవీ మొత్తం రుచిని తీసుకుంటుంది.
  17. ఆవిరి దాని అంతట అదే పోనివ్వండి మరియు ఛోలే వడ్డనకి సిద్ధం.
  18. భటురా పద్ధతి- మైదా, పెరుగు, ఉప్పు, 1 చెంచా నూనెని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి.
  19. మెత్తని పిండిలా మర్దించండి.
  20. అది కొంచెం ఉబ్బెదాకా దానిని దాదాపు 3 గంటలు(వేసవిలో) లేదా 5 గంటలు (చలికాలంలో) కదపకుండా ఉంచండి.
  21. భాటురాని వేయించడానికి ఒక బాండీలో నూనె వేయండి.
  22. ఈలోగా, పిండిలో కొంచెం చిన్న ఉండతీసుకుని మనం రోటీలు/పూరీలకి చేసినట్టుగా వత్తండి.
  23. పిండి బాగా మెత్తగా ఉండడం వల్ల వత్తేటప్పుడు పిండిని పైన వెయ్యడానికి వాడండి.
  24. వాటిని తక్కువ లేదా మధ్యస్థ వేడి మీద వేయించండి.
  25. చదునైన చెంచాతో వత్తండి అందువల్ల భటురా పొంగి త్వరగా పైకి వస్తుంది.
  26. రెండు వైపులా బంగారు గోధుమలోకి వచ్చే దాకా వేయించండి.
  27. టిష్యూ పేపర్ మీద తీయండి అందువల్ల అధిక నూనె పోతుంది. వేడిగా వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర