బేబీ కార్న్ మష్రూమ్ మసాలా | Baby corn mushroom masala Recipe in Telugu

ద్వారా Dr.Kamal Thakkar  |  21st Mar 2017  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Baby corn mushroom masala recipe in Telugu,బేబీ కార్న్ మష్రూమ్ మసాలా , Dr.Kamal Thakkar
బేబీ కార్న్ మష్రూమ్ మసాలా by Dr.Kamal Thakkar
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

160

0

బేబీ కార్న్ మష్రూమ్ మసాలా వంటకం

బేబీ కార్న్ మష్రూమ్ మసాలా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Baby corn mushroom masala Recipe in Telugu )

 • పుట్టగొడుగులు - 200గ్రాములు
 • బేబీ కార్న్ - 100 గ్రాములు
 • పచ్చిబటాని- 1 కప్పు
 • రుచికి తగినంత ఉప్పు
 • లవంగాలు - 5
 • దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
 • బిరియాని ఆకు- 1
 • యాలకులు - 4
 • టమోటాలు - ౩
 • ఉల్లిపాయలు - 2
 • వెల్లుల్లి రెబ్బలు -6
 • పచ్చిమిరపకాయ - 1
 • అల్లం - 1 అంగుళం
 • జీలకర్ర - 1 చెంచా
 • పసుపు - 1/2 చెంచా
 • కారం - 2 చెంచాలు
 • జీలకర్ర పొడి - 1 చెంచా
 • ధనియాల పొడి - 1 చెంచా
 • గరం మసాలా - 1 చెంచా
 • కసూరి మేతి - 1 చెంచా
 • క్రీం - 1 చెంచా
 • అలంకరించడానికి కొత్తిమీర

బేబీ కార్న్ మష్రూమ్ మసాలా | How to make Baby corn mushroom masala Recipe in Telugu

 1. పుట్టగొడుగులను కడిగి తరిగిపెట్టాలి. బేబీ కార్న్ ని కొద్దిగా ఉడికించాలి.
 2. తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు అల్లం అని మిక్సిలో వేసి పేస్టు లాగ రుబ్బాలి.
 3. టమాటాలు వేరేగా రుబ్బాలి.
 4. ఒక చెంచ ఆలివ్ నునే పాన్ లో వేసి అందులో జీలకర్ర, లవంగాలు, బిర్యాని ఆకు, దాల్చిన చెక్క, యాలకులు మరియు ఇంగువా వెయ్యాలి.
 5. అందులో ఉల్లిపాయ అల్లం పేస్టు వేసి పచ్చి వాసన పోయి దాకా వేయించాలి.
 6. ఇప్పుడు అన్ని మసాలాలను వెయ్యాలి అంటే పసుపు, కారం, ఉప్పు , జీలకర్ర మరియు ధనియాల పొడి.
 7. కాసేపు వేయించి అందులో పుట్టగొడుగు ముక్కలను వేసి బాగా కలపాలి దాని వాళ్ళ ఆ ముక్కలకి మసాలా అంటుకుంటుంది. ముతా పెట్టి 4 నిమిషాలు ఉంచాలి.
 8. అందులో బేబీ కార్న్ మరియు పచ్చి బటాని కుడా వెయ్యాలి. మళ్ళి ముతా పెట్టి 5 నిమిషాలు ఉంచాలి.
 9. ఇప్పుడు టమాటో రసం వెయ్యాలి. బాగా కలిపి ముతా వేసి మరో ౩ నిమిషాలు ఉంచాలి.
 10. పుట్టగొడుగులు మరియు పచ్చిబాటనిలు బాగా ఉడికాయో లేదో చుడండి.
 11. చివరగా గరం మసాలా మరియు కసూరి మేతి వెయ్యాలి. బాగా కలపాలి.
 12. ఇప్పుడు కొత్తిమీర మరియు క్రీం తో అలంకరించాలి.
 13. వేడిగా రోటిలు, పరటాలు లేదా నాన్ మరియు రైస్ తో వడ్డించండి.

నా చిట్కా:

ముష్రూలను నీళ్ళలో ఉంచకూడదు. కేవలం నీళ్ళతో కడిగి తుడవాలి, అలా కాకుండా నీళ్ళలో వేస్తే అది నీళ్ళను పిల్చుకొని వండుతునప్పుడు ఆ నీటిని వదులుతాయి.

Reviews for Baby corn mushroom masala Recipe in Telugu (0)