చనా మసాలా. (మహారాష్ట్ర శైలి) | Chana Masala. ( Maharashtrian style) Recipe in Telugu

ద్వారా Manisha Shukla  |  27th Mar 2017  |  
4 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Chana Masala. ( Maharashtrian style) recipe in Telugu,చనా మసాలా. (మహారాష్ట్ర శైలి), Manisha Shukla
చనా మసాలా. (మహారాష్ట్ర శైలి)by Manisha Shukla
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

426

1

చనా మసాలా. (మహారాష్ట్ర శైలి) వంటకం

చనా మసాలా. (మహారాష్ట్ర శైలి) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chana Masala. ( Maharashtrian style) Recipe in Telugu )

 • సెనగలు (ఎండు) 1/2 కప్పు
 • ఉల్లిపాయలు 2
 • టమోటా 1 1/2
 • తురిమిన కొబ్బరి (ఎండు, తాజా) 1 పెద్దచెంచా/ కొబ్బరి పాలు
 • తురిమిన అల్లం 1 చెంచా
 • చిదిమిన వెల్లుల్లి 1 చెంచా
 • ఖాడా మసాలా (దాల్చిని, లవంగాలు, మిరియం, బిర్యానీ ఆకులు)
 • ధనియా పొడి 1 చెంచా
 • పసుపు 1/2 చెంచా
 • రుచికి ఉప్పు, ఎండు కారం పొడి
 • నూనె 2 చెంచాలు
 • సన్నగా తరిగిన కొత్తిమీర అలంకరణకి 2 చెంచాలు
 • తాజా క్రీం 1 పెద్ద చెంచా

చనా మసాలా. (మహారాష్ట్ర శైలి) | How to make Chana Masala. ( Maharashtrian style) Recipe in Telugu

 1. సెనగలని కడగండి. ఉల్లియాలని కోయండి.
 2. ప్రషర్ ప్యానులో నూనెని వేడిచేయండి.
 3. మొత్తం ఖాడా మసాలాని వేయండి. వాటిని చిటపట లాడించండి.
 4. తాజాగా రుబ్బదానికి ప్యాను నుండి బయటికి తీయండి.
 5. ఇప్పుడు ఉల్లిపాయల్ని వేడి కలపండి.
 6. తురిమిన అల్లం, వెల్లుల్లి, ధనియా పొడి, పసుపు, కారం వేయండి.
 7. 2 నిమిషాలు కలపండి. ఇప్పుడు వేడి నీళ్ళు పోయండి.
 8. నీళ్ళు ఉడకగానే సెనగలని వేసి బాగా కలపండి. 5 నుండి 6 విజిల్స్ రానీయండి.
 9. టమోటాలని గుజ్జు చేయండి. వేరే ప్యానులో నూనెని వేడిచేయండి. గుజ్జు చేసిన టమోటాలని వేసి కలపండి.
 10. ఇప్పుడు టమోటాలకి తురిమిన కొబ్బరి వేయండి. మీరు కొబ్బరి పాలని కూడా వాడవచ్చు. కానీ అది టమోటాలు బాగా మెత్తగా కలిపిన తర్వాతే వేయాలి.
 11. టమోటా కొబ్బరి మిశ్రమాన్ని బాగా కలపాలి.
 12. ఇది బాగా కలిపాక తాజాగా రుబ్బిన గరం మసాలా వేయండి.
 13. ఇప్పుడు మీరూ ఉడికించిన సెనగలని వేయండి. అవి ఆకర్షణగా కనిపిస్తున్నాయా?
 14. టమోటా కొబ్బరి మిశ్రమానికి సెనగలని కలపండి.
 15. తాజా క్రీం (మలాయ్) తీసుకొని చిలకండి.
 16. గ్రేవీకి కలపండి. బాగా కలపండి.
 17. మీ రుచికి తగినట్టుగా మసాలాని సరిచేయండి. కొత్తిమీరతో అలంకరణ చేసి వడ్డించండి.

నా చిట్కా:

ఖాడా మసాలాతో మీరు సెనగలని కూడా ప్రషర్ కుక్ చేయవచ్చు. అప్పుడు మీరు రెడీ-మేడ్ చనా మసాలాని వేయవచ్చు.

Reviews for Chana Masala. ( Maharashtrian style) Recipe in Telugu (1)

Sunita.B Rao10 months ago

జవాబు వ్రాయండి

Cooked it ? Share your Photo