పెసర పప్పు ప్లైన్ దోసా | Moong Dal plain dosa Recipe in Telugu

ద్వారా Avni Arora  |  1st May 2017  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Moong Dal plain dosa by Avni Arora at BetterButter
పెసర పప్పు ప్లైన్ దోసా by Avni Arora
 • తయారీకి సమయం

  25

  నిమిషాలు
 • వండటానికి సమయం

  4

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

124

1

పెసర పప్పు ప్లైన్ దోసా వంటకం

పెసర పప్పు ప్లైన్ దోసా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Moong Dal plain dosa Recipe in Telugu )

 • కావలసినంత నూనే
 • కావలసినన్ని నీళ్ళు
 • రుచికి తగినంత ఉప్పు
 • పచ్చిమిరపకాయలు 2
 • అల్లం 1 చెంచా
 • పెసర పప్పు( పసుపు రంగు) 2 కప్పులు

పెసర పప్పు ప్లైన్ దోసా | How to make Moong Dal plain dosa Recipe in Telugu

 1. పెసరపప్పును ఒక గిన్నెలో తీసుకోవాలి.
 2. బాగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టాలి.
 3. తరువాత నీళ్ళను తీసేయండి.
 4. ఒక మిక్సి జార్ ను తీసుకోండి.
 5. నీటిలో నుంచి తీసిన పేసర్ పప్పు, అల్లం, పచ్చిమిర్చి మరియు ఉప్పు వెయ్యండి.
 6. కొంచం కొంచంగా నీళ్ళను కలుపుతూ మెత్తని పిండిగా రుబ్బండి.
 7. మాములు దోస అంత చిక్కగా రుబ్బెతే సరిపోతుంది.
 8. నూనే వేసి ఎక్కువ మంట లో ఉంచాలి.
 9. ఇప్పుడు మంట తగ్గించి.
 10. ఉల్లిపాయ ముక్కతో పెనంను శుభ్రం చేసి.
 11. ఒక గరిట పిండిని పెనం పైన వెయ్యాలి.
 12. చాలా సన్నగా గుండ్రంగా వచ్చేలా గరితను తిప్పాలి, మాములు దోసలాగానే.
 13. చూటు నూనే వెయ్యాలి.
 14. తక్కువ మంటపైన కొన్ని నిముషాలు ఉంచి దోస కాలేదాకా చూడాలి.
 15. మరో వైపు తిపాలి.
 16. కొన్ని క్షణాలు ఉంచాక, మరో వైపు తిప్పాలి.
 17. దోసను చుట్టి.
 18. ప్లేట్ లోకి తియ్యాలి.
 19. అన్ని దోసలు ఇలాగే వేసుకోవాలి.
 20. వేడి వేడిగా సాంబార్ లేదా కొబ్బరి చట్నితో వడ్డించండి.

Reviews for Moong Dal plain dosa Recipe in Telugu (1)

Sharvani Gundapanthulaa year ago

జవాబు వ్రాయండి