వెజిటబుల్ పులావు | Vegetable Pulao Recipe in Telugu

ద్వారా Sehej Mann  |  29th Oct 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Vegetable Pulao recipe in Telugu,వెజిటబుల్ పులావు, Sehej Mann
వెజిటబుల్ పులావుby Sehej Mann
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2632

0

వెజిటబుల్ పులావు వంటకం

వెజిటబుల్ పులావు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vegetable Pulao Recipe in Telugu )

  • 100 గ్రాముల బాస్మతీ బియ్యం
  • సన్నగా తరిగిన 1 చిన్న పరిమాణ ఉల్లిపాయ
  • 1/2 కప్పు మిశ్రమ కూరగాయలు(బఠాణీ/క్యారెట్లు/టమేటా/క్యాలీఫ్లవర్)
  • 1/2 చెంచా జీలకర్ర పొడి(వేయించింది)
  • 1/2 చెంచా గరం మసాల పొడి
  • 1/2 చెంచా జీలకర్ర
  • 1 చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
  • 750 మిలీ నీరు
  • 2 బిర్యానీ ఆకులు
  • 1 నక్షత్ర సోంపు
  • 2 లవంగాలు
  • 1/2 దాల్చిన చెక్క
  • 1 యాలకులు
  • 1 చెంచా నూనె
  • ఉప్పు రుచికి తగినంత
  • మసాల పదార్థాలు:
  • 1 ముక్క యాలకులు
  • 1 ముక్క నక్షత్ర సోంపు
  • 2 లవంగాలు
  • 4-5 మిరియాలు
  • దాల్చిన చెక్క సగం

వెజిటబుల్ పులావు | How to make Vegetable Pulao Recipe in Telugu

  1. మీరు వంట మొదలెట్టే ముందు 15 నిమిషాలు బియ్యాన్ని నానబెట్టండి. అప్పుడు గిన్నెలో నీటితో మరియు మసాలా దినుసులు- బిర్యానీ ఆకు, చిన్న ముక్క సోంపు, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క , యాలక్కాయ వేసి బియ్యం పెట్టండి. దాన్ని సిమ్మార్లో వండండి.
  2. ఈలోగా, మసాలా దినుసులని వేయించి వాటిని బాగా పొడిగా రుబ్బండి.
  3. అన్నం ఉడికిన తర్వాత, దానిని సమానంగా పళ్ళెంలో పరిచి చల్లార నివ్వండి.
  4. కూరగాయలు ఉడికించి 10 నిమిషాలు అవి మెత్తగా కరకగా అయ్యేదాకా వండండి.
  5. బాండీ తీసుకుని, నూనె పోయండి, నూనె వేడెక్కాక జీలకర్ర వేయండి. జీలకర్ర చిటపటలాడాక, ఉల్లిపాయలు వేసి నిమిషం పాటు వేయించండి.
  6. 1/2 చెంచా కేవలం మసాల దినుసుల మిశ్రమంతో పాటుగా అల్లం-వెల్లుల్లి ముద్ద వేయండి. అంతేకాక దానిలో వేయించిన జీలకర్ర పొడి మరియు గరం మసాలా పొడి వేయండి.
  7. కలిపి బాగా కలపండి, రుచి ప్రకారం ఉప్పు వేయండి. తర్వాత, దానిలో కూరగాయలు వేయండి, తిప్పండి మరియు 1-2 నిమిషాలు వండండి.
  8. చివరగా వండిన అన్నాని వేయండి. మూతతో మూసి మరొక 2-3 నిమిషాలు వండండి.
  9. మీకిష్టమైన వెజ్ లేదా నాన్-వెజ్ గ్రేవీతో వేడిగా వడ్డించండి.

Reviews for Vegetable Pulao Recipe in Telugu (0)