డొక్లా | Dhokla. Recipe in Telugu

ద్వారా Neha Sharma  |  26th May 2017  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Dhokla. by Neha Sharma at BetterButter
డొక్లాby Neha Sharma
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

338

0

డొక్లా

డొక్లా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dhokla. Recipe in Telugu )

 • శనగ పిండి 1 కప్పు
 • 1 పెద్ద చెంచ బొంబాయి రవ్వ
 • రుచికి తగినంత ఉప్పు
 • 1 చెంచ నిమ్మకాయ రసం
 • 1 చెంచ ఇనో
 • 1/2 చెంచ తురిమిన అల్లం
 • 4 పచ్చిమిరపకాయలు
 • 1/4 కప్పు పెరుగు
 • నీళ్ళు
 • 2 చెంచాల ఆవాలు
 • 20 కరివేపాకు ఆకులు
 • ఇంగువ ఒక చిటికెడు
 • 2 పెద్ద గరిటల నూనే
 • 1/4 కప్పు నీళ్ళు
 • 2 పెద్ద చెంచాల తరిగిన కొత్తిమీర
 • 1 చెంచ చెక్కెర

డొక్లా | How to make Dhokla. Recipe in Telugu

 1. పచ్చి మిరపకాయలు మరియు అల్లం వెల్లులి కాస్త నీళ్ళు పోసి మెత్తగా మిక్సి పట్టాలి.
 2. కుకర్ లో కావలసినంత నీళ్ళు పోసి తక్కువ మంటలో వేడి చెయ్యాలి..ఒక ఉండ్రటి పాన్ కి ఆయిల్ రాయాలి.
 3. జల్లించిన శనగ పిండిని గిన్నెలోకి తీసుకోవాలి, అందులో బొంబాయి రవ్వ పచ్చిమిర్చి అల్లం వెల్లులి పేస్టు నిమ్మ రసం ఉప్పు మరియు పెరుగు వేసి, చెంచాతో బాగా కలపాలి.
 4. కావలసిన చిక్కదనం వచ్చేదాకా నీళ్ళు పోసికోవాలి మరియు ఉండలు కట్టకుండా చూసుకోవాలి. నీళ్ళు కుకర్ లో మరగనివ్వాలి. కక్కెర్ఇ లోకి ఆ పిండిని తరలించే ముందు ఇనో ని ఆ మిశ్రమం లో కలపాలి.
 5. ప్రెజర్ కుకర్ లో మూడు కాళ్ళ చట్రం ఉంచాలి.
 6. మిశ్రామం అంతా పాన్ లోకి తీసుకోవాలి మూత వేసి విజిల్ పెట్టుకూడదు. మంటను తక్కువకు తగ్గించాలి.
 7. 12- 15 నిమిషాలు వండాలి. డొక్లా ని ఒక పుల్ల దుర్చు పరీక్షించాలి.
 8. కొంచం సేపు చల్లారనివ్వాలి.
 9. పాన్ లో నుంచి డొక్లా తీయండి.
 10. పోపు వెయ్యడం కోసం నూనే ను వేడి చేసి అందులో ఆవాలు కరివేపాకు పాచి మిర్చి. ఇంగువ తరువాత నీళ్ళు వేయండి. కాసేపు ఉడకనివ్వండి. తరువాతా డొక్లా పై పొయ్యండి మరియు స్క్వేర్ గా ముక్కలను కట్ చెయ్యండి.
 11. తరిగిన కొత్తిమీరతో అలంకరించాలి.

Reviews for Dhokla. Recipe in Telugu (0)