లిట్టి చోఖా | Litti Chokha Recipe in Telugu

ద్వారా Abhishek Sharma  |  6th Aug 2017  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Litti Chokha by Abhishek Sharma at BetterButter
లిట్టి చోఖాby Abhishek Sharma
 • తయారీకి సమయం

  35

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

236

1

లిట్టి చోఖా వంటకం

లిట్టి చోఖా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Litti Chokha Recipe in Telugu )

 • రుచికి తగినంత ఉప్పు
 • 2 చెంచాలు ఆవనునే
 • తరిగిన కొత్తిమీర ఆకులు
 • 2 తరిగిన ఉల్లిపాయలు
 • 1 తురిమిన అల్లం
 • 2 - ౩ పచ్చిమిరపకాయలు తరిగినవి
 • 4 - 5 వెల్లుల్లి రెబ్బలు
 • ౩ టొమాటోలు
 • 1 పెద్ద వంకాయ
 • 2 ఉడికించిన బంగాళాదుంపలు
 • చోఖ కోసం :
 • రుచికి తగినంత ఉప్పు
 • 2 చెంచాలు కారం మసాలా ( ఇష్టమైతే)
 • 1 చెంచ నిమ్మ రసం
 • 1 చెంచా వాము
 • 1/2 చెంచా కలోంజి/ ఉల్లి విత్తనాలు
 • కొత్తిమీర ఆకులు తరిగినవి
 • 2 - ౩ పచ్చిమిరపకాయలు తరిగినవి
 • 1 తురిమిన అల్లం
 • 1 తరిగిన ఉల్లిపాయ
 • 4 - 5 తురిమిన వెల్లుల్లి రెబ్బలు
 • 1 గిన్నె వేయించిన శనగ పిండి
 • లోపలి మిశ్రమం కోసం:
 • ౩/4 చెంచా ఉప్పు
 • 1/2 చెంచా వాము
 • 2 పెద్ద స్వచ్చమైన నెయ్యి
 • 2 కప్పులు గోధుమ పిండి
 • లిట్టి యొక్క బయట వైపు తయ్యారు చేయటానికి:

లిట్టి చోఖా | How to make Litti Chokha Recipe in Telugu

 1. పిండిని పెద్ద గిన్నెలో జల్లించి అందులో ఉప్పు, వాము మరియు నునే వెయ్యాలి.
 2. నీళ్ళతో పిండిని బాగా కలపాలి. పిండి మెత్తగా ఉండాలి.
 3. ఒక తడి గుడ్డని పైన వేసి పక్కన పెట్టండి. పిండి సిద్ధం.
 4. శనగ పిండిని గిన్నెలో వేసి, అన్ని మసాలాలు మరియు తురిమిన అల్లం, పచ్చిమిర్చి , కొత్తిమీర , నిమ్మరసం అన్ని బాగా కలపాలి.
 5. మరి పొడిగా ఉనట్టు అనిపిస్తి, కాస్త నునే మరియు నీళ్ళను వెయ్యచ్చు.
 6. బరకగా ఉండాలి, పక్కన పెట్టండి.
 7. కొంచం పిండి ముద్దను తీసుకోని. చపతిల్లా ఒత్తాలి, గాని పైన పిండి వెయ్యకర్లేదు.
 8. మనం చేసిన ఆ బారాగా ఉనా మిక్సర్ ని ఇందులో వెయ్యాలి మళ్ళి ఉండలా చుట్టాలి
 9. లిట్టిలు బెక్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు 10-12 ఉండలు చెయ్యండి.
 10. ఓవెన్ ను 200 డిగ్రీలకు వేడి చేసి. అన్ని ఉండలను బేకింగ్ గిన్నెలో ౩౦ - 40 నిమిషాల పాటు బెక్ చెయ్యాలి.
 11. మధ్యలో మరోవైపు తిప్పండి, మధ్యమధ్యలో అలా 2- 3 సార్లు చేయాల్సిఉంటుంది దాని వలన అన్ని వైపులా బాగా కాలుతుంది.
 12. బెక్ చేయటం ఇష్టం లేకపోతే డీప్ ఫ్రై చెయ్యవచ్చు.
 13. బంగాల దుంపలను ఉడికించి పై తోలును తియ్యాలి మరియు పక్కన పెట్టాలి.
 14. గ్యాస్ స్టవ్ మీద మధ్యస్త మంటపైన వంకాయలు మరియు టమాటాలను వేయించాలి
 15. వంకాయలు కాల్చాక దాని పైన తోలును తీసివెయ్యాలి. ఉడికిన బంగాలదుంపలు, వంకాయలు అల్లం మరియు టమాటాలు అన్ని కలిపి రుబ్బాలి.
 16. తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర ఆకులు, తురిమిన అల్లం , ఉప్పు, పచ్చిమిర్చి మరియు ఆవ నూనే వెయ్యాలి.
 17. అన్నిటిని సరిగ్గా చేత్తో కలపాలి. చోఖ సిద్ధం.
 18. చోఖ ని గిన్నెలో వెయ్యాలి, వేడి వేడి లిట్టి ని నేతిలో ముంచుకొని కొత్తిమీర చట్నితో తినాలి.

నా చిట్కా:

లిట్టిలను ఎలక్ట్రిక్ తందూరీ లో కుడా బెక్ చెయ్యవచ్చు.

Reviews for Litti Chokha Recipe in Telugu (1)

Sharvani Gundapanthulaa year ago

జవాబు వ్రాయండి

Cooked it ? Share your Photo