పెరుగన్నం | Curd Rice Recipe in Telugu

ద్వారా Poonam Bachhav  |  28th Nov 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Curd Rice by Poonam Bachhav at BetterButter
పెరుగన్నంby Poonam Bachhav
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

732

0

పెరుగన్నం వంటకం

పెరుగన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curd Rice Recipe in Telugu )

 • 1 కప్పు బియ్యం
 • 1 1/2 కప్పు పెరుగు (సాదా తీపికలపని పెరుగు)
 • 1/4 కప్పు పాలు
 • 1 ఎండు మిర్చి
 • 1 నుండి 2 రెబ్బల కరివేపాకు
 • 2 నుండి 3 పచ్చిమిర్చి, సన్నగా తరిగినది
 • అలంకరణకి తాజా కొత్తిమీర
 • 1/4 చెంచా ఆవాలు
 • ఇంగువ ఒక చిటికెడు
 • 1 చెంచా పోపు మినపపప్పు పొట్టు తీసిన బద్దలు
 • 2 నుండి 3 పెద్ద చెంచాల దానిమ్మ గింజలు (ఎంపిక)
 • 1 పెద్ద చెంచా నూనె
 • ఉప్పు తగినంత

పెరుగన్నం | How to make Curd Rice Recipe in Telugu

 1. బియ్యాని కడిగి, అది మెత్తగా మరియు బాగా ఉడికేలా 2 1/2 కప్పుల నీళ్ళు పోసి గిన్నెలో లేదా ప్రెషర్ కుక్కరులో ఉడికించండి. నేను దానిని 3 విజల్స్ వచ్చేలా ప్రషర్ కుక్కరులో వండాను. ఈ రెసిపీ కోసం అన్నం కొంచెం ఎక్కువ ఉడకాలి.
 2. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. అన్నం బాగా వేడిగా ఉన్నప్పుడే పాలను పోసి, చెంచాతో అన్నాన్ని మెదపండి. ఈ సమయంలో మీకు క్రీమీగా ఉంటే ఇష్టం అయితే కొంచెం వెన్న లేదా నెయ్యిగానీ పెరుగు అన్నానికి కలపండి.
 3. అన్నం పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పెరుగు వేసి, ఉప్పు వేసి బాగా కలపండి. దానిలో తరిగిన కొత్తిమీర మరియు పచ్చిమిర్చి వేయండి.
 4. పోపు కోసం, చిన్న వేపుడు బాండీ తీసుకుని ఆవాలు వేయండి. ఆవాలు చిటపట లాడాక, దానిలో మినపప్పు బద్దల్ని, కరివేపాకుని, ఎండు మిర్చి మరియు ఇంగువని వేయండి. 30 సెకన్ల నుండి 1 నిమిషం పాటు వేయించండి మరియు మంటని ఆపేయండి.
 5. దీనిని పెరుగు అన్నం మీద పోసి కలపండి. దానిమ్మ గింజలతో అలంకరించి, మీకిష్టమైన పచ్చడితో వడ్డించండి మరియు దానిని అలా అయినా ఆస్వాదించండి. మీరు అలంకరణకి వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష లేదా కిస్మిస్ ని కూడా వేయవచ్చు.

నా చిట్కా:

అన్నానికి పెరుగుని అది పూర్తిగా చల్లారాక మాత్రమే కలపాలి. వేడి అన్నంలోకి పెరుగుని వేయండం వాళ్ళ అది బ్యాక్టీరియాని చంపుతుంది మరియు పెరుగు విరుగుతుంది.

Reviews for Curd Rice Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo