హోమ్ / వంటకాలు / పెరుగన్నం

Photo of Curd Rice by Poonam Bachhav at BetterButter
3810
142
4.7(0)
0

పెరుగన్నం

Nov-28-2015
Poonam Bachhav
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తమిళనాడు
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రెజర్ కుక్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్పు బియ్యం
  2. 1 1/2 కప్పు పెరుగు (సాదా తీపికలపని పెరుగు)
  3. 1/4 కప్పు పాలు
  4. 1 ఎండు మిర్చి
  5. 1 నుండి 2 రెబ్బల కరివేపాకు
  6. 2 నుండి 3 పచ్చిమిర్చి, సన్నగా తరిగినది
  7. అలంకరణకి తాజా కొత్తిమీర
  8. 1/4 చెంచా ఆవాలు
  9. ఇంగువ ఒక చిటికెడు
  10. 1 చెంచా పోపు మినపపప్పు పొట్టు తీసిన బద్దలు
  11. 2 నుండి 3 పెద్ద చెంచాల దానిమ్మ గింజలు (ఎంపిక)
  12. 1 పెద్ద చెంచా నూనె
  13. ఉప్పు తగినంత

సూచనలు

  1. బియ్యాని కడిగి, అది మెత్తగా మరియు బాగా ఉడికేలా 2 1/2 కప్పుల నీళ్ళు పోసి గిన్నెలో లేదా ప్రెషర్ కుక్కరులో ఉడికించండి. నేను దానిని 3 విజల్స్ వచ్చేలా ప్రషర్ కుక్కరులో వండాను. ఈ రెసిపీ కోసం అన్నం కొంచెం ఎక్కువ ఉడకాలి.
  2. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. అన్నం బాగా వేడిగా ఉన్నప్పుడే పాలను పోసి, చెంచాతో అన్నాన్ని మెదపండి. ఈ సమయంలో మీకు క్రీమీగా ఉంటే ఇష్టం అయితే కొంచెం వెన్న లేదా నెయ్యిగానీ పెరుగు అన్నానికి కలపండి.
  3. అన్నం పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పెరుగు వేసి, ఉప్పు వేసి బాగా కలపండి. దానిలో తరిగిన కొత్తిమీర మరియు పచ్చిమిర్చి వేయండి.
  4. పోపు కోసం, చిన్న వేపుడు బాండీ తీసుకుని ఆవాలు వేయండి. ఆవాలు చిటపట లాడాక, దానిలో మినపప్పు బద్దల్ని, కరివేపాకుని, ఎండు మిర్చి మరియు ఇంగువని వేయండి. 30 సెకన్ల నుండి 1 నిమిషం పాటు వేయించండి మరియు మంటని ఆపేయండి.
  5. దీనిని పెరుగు అన్నం మీద పోసి కలపండి. దానిమ్మ గింజలతో అలంకరించి, మీకిష్టమైన పచ్చడితో వడ్డించండి మరియు దానిని అలా అయినా ఆస్వాదించండి. మీరు అలంకరణకి వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష లేదా కిస్మిస్ ని కూడా వేయవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర