ఇడ్లి | Idli Recipe in Telugu

ద్వారా Sonu   |  24th Sep 2017  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Idli by Sonu at BetterButter
ఇడ్లిby Sonu
 • తయారీకి సమయం

  20

  గంటలు
 • వండటానికి సమయం

  12

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

384

1

ఇడ్లి వంటకం

ఇడ్లి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Idli Recipe in Telugu )

 • 1 1/4 కప్పు - మినప్పప్పు( పొట్టు లేనిది)
 • 3 కప్పులు- బియ్యం( మీరు ఏ బియ్యం అయినా వాడవచ్చు, ఎక్కువగా విరిగినది మంచిది, కాని బాస్మాతి అలాంటివి కావు)
 • 2 చెంచాల - ఉప్పు
 • రుబ్బడానికి నీళ్ళు కావాలి

ఇడ్లి | How to make Idli Recipe in Telugu

 1. కడిగి మినప్పప్పు మరియు బియ్యాన్ని విడి విడిగా నానబెట్టాలి.
 2. 8 - 9 గంటలు లేదా రాత్రికి నానబెట్టాలి.
 3. ఇప్పుడు మినపప్పును మరియు బియ్యని విడివిడిగా మెత్తని పేస్టు లాగా రుబ్బాలి.
 4. ఇప్పుడు ఆ రెండిటిని కలిపి దానికి ఉప్పు కలపాలి.
 5. దానిని 6 నుంచి 7 గంటలు పులవటానికి పక్కన పెట్టండి.
 6. ప్రషర్ కుకర్ లో ఒక గ్లాస్ నీళ్ళను వేడి చెయ్యాలి.
 7. ఇడ్లి స్టాండ్ కు నూనే లేదా నెయ్యి రాసి గారిట నిండా పిండిని తీసుకోని అందులో పోయాలి .
 8. ఆ స్టాండ్ ని ప్రషర్ కుకర్ లో పెట్టాలి.
 9. ప్రషర్ కుకర్ పైన మూత పెట్టాలి విజిల్ పెట్టకూడదు.
 10. ఎక్కువ మంటలో 10 -12 నిమిషాలు ఉడికించాలి మరియు స్టవ్ ఆపివేయాలి.
 11. 5 నిమషాల పాటు అలా ఉండనిచ్చిన తరువాత కుకర్ లో నుంచి స్టాండ్ ని బయటకు తియ్యాలి.
 12. మళ్ళి ఇంకో 5 నిమిషాలు ఆగి అందులో నుంచి చెంచాతో ఇడ్లిలను బయటకు తియ్యాలి.
 13. కొబ్బరి చెట్నీ లేదా వేడి వేడి సాంబార్ తో వడ్డించాలి.

నా చిట్కా:

మెత్తని మరియు మృదువైన ఇడ్లిల కోసం పిండిని సరిగ్గా పులవనివ్వాలి.

Reviews for Idli Recipe in Telugu (1)

Padma Padmapv9 months ago

మీరు, చేపినవిధం గా, చేస్తే, ఇడ్లీ లు, మృదువు గావచ్చాయి, thankyou!
జవాబు వ్రాయండి