నిమ్మకాయ వెన్న సాస్ తో గ్రిల్డ్ చేప | Grilled fish with lemon butter sauce Recipe in Telugu

ద్వారా Moumita Malla  |  23rd Dec 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Grilled fish with lemon butter sauce by Moumita Malla at BetterButter
నిమ్మకాయ వెన్న సాస్ తో గ్రిల్డ్ చేపby Moumita Malla
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1004

0

నిమ్మకాయ వెన్న సాస్ తో గ్రిల్డ్ చేప వంటకం

నిమ్మకాయ వెన్న సాస్ తో గ్రిల్డ్ చేప తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Grilled fish with lemon butter sauce Recipe in Telugu )

 • చేప ఫిల్లెట్స్- 6 (ఏవైనా తెల్ల చేప ఫిల్లెట్స్- 6-10 అడుగుల ఒక్కోటి)
 • వెన్న- 2 పెద్ద చెంచాలు(కరిగినది)
 • నిమ్మరసం- 2 పెద్ద చెంచాలు
 • వెల్లుల్లి రెబ్బలు- 2 (చిదిమినవి)
 • తరిగిన పార్స్లీ (కొత్తిమీర లాంటిది)- 1 పెద్ద చెంచా
 • ఉప్పు మరియు పొడిచేసిన మిరియాలు- రుచికి తగినట్లు
 • ఎండు మిరపకాయలు - 1 చెంచా
 • వెజిటబుల్ నూనె- 1/2 చెంచా
 • నిమ్మ వెన్న సాస్ చేయడానికి పదార్థాలు:
 • వెన్న- 1/2 కప్పు
 • నిమ్మరసం- 4 పెద్ద చెంచాలు
 • వెల్లుల్లి రెబ్బలు- 4 చిదిమినవి
 • ఉప్పు రుచికి
 • రుచికి తగినట మిరియాల పొడి
 • తాజా పార్ల్సీ- 1 చెంచా(తరిగినది)
 • కొత్తిమీర - 2 చెంచాలు (తరిగినవి)

నిమ్మకాయ వెన్న సాస్ తో గ్రిల్డ్ చేప | How to make Grilled fish with lemon butter sauce Recipe in Telugu

 1. ఒక గిన్నెలో, వెల్లుల్లి, వెన్న, పార్స్లీ, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం మరియు ఎండుమిరపకాయ తుంపులు కలిపి బాగా కలపండి.
 2. మిశ్రమంలో చేప ఫైల్లెట్లను వేయండి. మసాలా దినుసులతో చేప ఫైల్లెట్లని బాగా రుద్దండి. 1 గంట పాటు ఫ్రిడ్జ్లో మూత పెట్టి పెట్టండి.
 3. గంట తర్వాత, ఫ్రిడ్జ్ నుండి చేప ఫైల్లెట్లను తొలగించండి.
 4. ఒవేనుని 450 డిగ్రీ ఫారన్హీట్ (230 డిగ్రీల సెల్సియస్) వరకు ముందుగా వేడి చేయండి, ఒవేనుని గ్రిల్ మోడులో పెట్టడం గుర్తుపెట్టుకోండి.
 5. అల్యూమినియం ఫాయిల్ తో గ్రిల్ ర్యాక్ ను లైన్ చేయండి.
 6. దానిమీద చేపని పెట్టండి. కొంచెం వెజిటబుల్ నూనె చేప మీద రుద్దండి. ముందుగా వేడి చేసిన ఓవెన్ యొక్క పైన సెక్షన్ మీద ర్యాక్ పెట్టండి.
 7. ఒక్కొక్క వైపు 10 నిమిషాలు గ్రిల్ చేయండి లేదా ఫోర్క్ తో సులభంగా తుంపేలా అయ్యేదాకా ఉంచండి.
 8. వడ్డన పళ్ళెంలోకి మార్చండి.
 9. నిమ్మ వెన్న సాస్ తయారీ విధానం.
 10. మధ్యస్థ పరిమాణ సాస్ ప్యానులో మధ్యస్థ మంట మీద వెన్నను కరిగించండి. తరిగిన వెల్లుల్లి, నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి పార్స్లీ వేయండి. దానిని ఒక ఉడుకు రానీయండి. దాదాపు 10 నిమిషాల పాటు కలుపుతూ, చిక్కబదేదాకా ఉడికించండి.
 11. గ్రిల్ చేసిన చేప ఫైల్లెట్ల మీద సాస్ వేయండి, తరిగిన కొత్తిమీరను చల్లండి మరియు ఉడికించిన కూరలు మరియు తాజా వేపుళ్ళతో వడ్డించండి.
 12. వెంటనే వడ్డించండి.

Reviews for Grilled fish with lemon butter sauce Recipe in Telugu (0)