పనీర్ బటర్ మసాలా | Paneer Butter Masala Recipe in Telugu

ద్వారా Pavithira Vijay  |  20th Jan 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Paneer Butter Masala by Pavithira Vijay at BetterButter
పనీర్ బటర్ మసాలాby Pavithira Vijay
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

8822

0

పనీర్ బటర్ మసాలా

పనీర్ బటర్ మసాలా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paneer Butter Masala Recipe in Telugu )

 • 225 గ్రాముల పనీర్
 • 2 పెద్ద చెంచాల బటర్
 • 1 చెంచ నూనే
 • ౩ లవంగాలు
 • 3 యాలకులు
 • 2 జాపత్రి
 • 1 మధ్యస్త ఉల్లిపాయ( పేస్టు చేసినది)
 • 1 చెంచ అల్లం-వెల్లులి పేస్టు.
 • 3 - 4 మధ్యస్త టమాటాలు(రసం చేసినవి)
 • 6 - 7 జీడిపప్పులు(నానబెట్టి పేస్టు చేసినవి)
 • 1 1/2 చెంచ కారం( లేదా రుచికి తగినంత)
 • 1 చెంచ ధనియాల పొడి.
 • ఒక చిటికెడు పసుపు
 • ఉప్పు తగినంత
 • ౩/4 చెంచ చెక్కెర
 • 1 చెంచ గరం మసాలా
 • 1 చెంచ తరిగిన కసూరి మేతి
 • 1 - 2 చెంచాలు ఫ్రెష్ క్రీం.

పనీర్ బటర్ మసాలా | How to make Paneer Butter Masala Recipe in Telugu

 1. పాన్ కి బటర్ రాసి పనీర్ ముక్కలను బంగారు రంగు వచ్చేదాకా మరియు పనీర్ కాస్త మెత్తబడే దాకా వెంచాలి. మరోవైపు కుడా తిప్పి అలాగే కాల్చాలి, చిన్న ముక్కలుగా కట్ చేసి అవసరం అయిదాక పక్కన పెట్టండి.
 2. అదే పాన్ లో ఇంకాస్త బటర్ మరియూ ఇంకా నూనే వెయ్యండి మరియు బటర్ కరిగాక, అందులో యాలకులు, లవంగాలు మరియు జాపత్రి వెయ్యండి. తరువాత అందులో ఉల్లిపాయ పేస్టు మరియు అల్లం-వెల్లులి పేస్టు వేసి వేయిస్తూ ఉండండి.
 3. ఉల్లిపాయ ముద్ద బాగా కలిపాక అది బంగారు గోధుమ రంగులోకి మారడం మొదలయ్యాక, టమోటా ముద్దని వెయ్యండి.
 4. ముతా పెట్టి 2-౩ నిమిషాలు వండండి తరువాత పొడులన్నీ వెయ్యండి(ఒక్క గరం మసాలా తప్ప)
 5. టమాటాలు పూర్తిగా పేస్టు లాగా అయి కాస్త నూనే వాడులుతునప్పుడు దాక వండండి.
 6. తరువాత ఒక కప్పు నీళ్ళు కలిపి వాటిని మరిగించండి.
 7. జీడిపప్పు పేస్టు ని వేసి, 3 - 4 నిమిషాలు బాగా కలపండి.
 8. చెక్కెర మరియు గరం మసాలాను చల్లండి, తరిగిన కసూరి మేతి కుడా వేసి బాగా కలపండి.
 9. వేయించిన పనీర్ ముక్కాలా మీద వెయ్యండి మరియు మధ్యస్త- చిన్న మంట పై 3 - 4 నిమిషాలు ఉంది అవి ఈ మాసాలని పిల్చుకోనివ్వండి.
 10. చిన్న మంటపైనే ఉంచి క్రీం వేసి కలపండి. 2 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చెయ్యండి.
 11. సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోని, ఇంకా క్రీం తో అలంకరించి సర్వ్ చెయ్యండి.

నా చిట్కా:

మీరు జీడిపప్పు పేస్టు కి బదులుగా బాదం పేస్టు లేదా గుమ్మడి గింజల పేస్టు అయినా వాడవచ్చు. చెక్కర రుచిని సమాంతరంగా ఉంచుతుంది పైనా టమాటో యొక్క పులుపుదానాన్ని తగ్గిస్తుంది. మీ ఇష్ట ప్రకారం సన్నటిమంట పైన పనీర్ ని వేయించండి, లేదా ఎక్కువ నూనెలో వేయించ వచ్చు కుడా కాని నేను అది ఎంచుకొను. లేదా కేవలం పనీర్ ని వేడి నీటిలో నానబెట్టవచ్చు సాస్ తయ్యరయ్యే లోపు. అదే సరైన పద్దతి.

Reviews for Paneer Butter Masala Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo