హోమ్ / వంటకాలు / పాలక్ పనీర్

Photo of Palak Paneer ! by Pavithira Vijay at BetterButter
2138
1035
4.5(0)
2

పాలక్ పనీర్

Jan-21-2016
Pavithira Vijay
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ పనీర్ రెసిపీ గురించి

ఒక ఆరోగ్యకరమైన మరియు ఐరన్ కలిగిన, క్రీం మరియు పచ్చని పాలకూర మిశ్రమంలో మెత్తని పనీర్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • ఉత్తర భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • మిళితం
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 3

  1. 2 కట్టల పాలకూర
  2. 350 గ్రాముల పనీర్
  3. తరిగిన ఒక మధ్యస్త ఉల్లిపాయ(సన్నగా తరిగిన)
  4. 2 టమాటోల రసం
  5. 2 పచ్చిమిర్చిలు
  6. 1- 2 చెంచాల నూనే
  7. 1 చెంచా జిలకర్ర
  8. 2 - 3 లవంగాలు
  9. ఒక చిటికెడు ఇంగువ
  10. 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు
  11. ఉప్పు తగినంత
  12. 1 చెంచ కారం
  13. 1/4 చెంచ పసుపు
  14. 1 చెంచ ధనియాల పొడి
  15. 1 చెంచా గరం మసాలా
  16. 3/4 చెంచ చెక్కెర
  17. 1 చెంచ నలిపిన కసూరి మేతి
  18. 2 చెంచాల ఫ్రెష్ క్రీం ( కచ్చితంగా వెయ్యాలని లేదు)

సూచనలు

  1. పాలకూర ఆకులను వలిచి మరియు బాగా కడగాలి. నీళ్ళను మరిగించి అందులో ఈ ఆకులను 2- 3 నిమిషాల వరకు ఉంచాలి మరియు ఈ ఆకులు ముడుచుకున్నట్లుగా ఉన్నప్పుడు స్టవ్ ఆపివేయాలి. తరవాత వాడకానికి నీళ్ళను ఒక గిన్నెలోకి తియ్యాలి.
  2. పాలకూర చల్లారక దానిని పచ్చిమిర్చితో కలిపి మిక్సి పట్టాలి.
  3. పాన్ లో నూనే వేసి జీలకర్ర, ఇంగువ మరియు లవంగాలు, తరువాత ఉల్లిపాయ మరియు అల్లంవెల్లులి పేస్టు వెయ్యాలి. అన్నింటినీ వేయించాలి.
  4. ఉల్లిపాయలు మెత్తగా వేగాక, అన్ని పొడులను వెయ్యాలి(గరం మసాలా తప్ప) మరియు ఉప్పు వేసి వేయించాలి. ఒకవేళ అవి మాడుతునట్టు లేదా అడుగు అంటుతున్నాట్టు ఉంటే కాస్త నీళ్ళు చల్లాలి.
  5. మసాలాలు బాగా వేగాక, టమాటా రసం కలపాలి మరియు దాని పచ్చి వాసన పోయేదాకా మరియు నూనే బయటకు వచ్చేదాకా వేయించాలి. కాస్త నీళ్ళను కలిపి ఉడకనివ్వాలి.
  6. పాలకురా మిశ్రమం, చెక్కెర కలిపి వెయ్యాలి. ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి తరువాత కాస్త గరం మసాలా చల్లి బాగా కలపాలి.
  7. పైన చెప్పినవన్ని చేస్తుండగా ఈ లోపు పనీర్ ని వేడి నీళ్ళలో 5 - 10 నిమిషాల పాటు ఉంచాలి. పనీర్ ముక్కలను పాలకూర గ్రేవిలో వెయ్యండి, కావాల్సి వస్తే నీళ్ళను కలపండి( పాలకురను ఉడికించిన నీళ్ళు పొయ్యండి)
  8. 2 - 3 నిమిషాలు తక్కువ మంట పై ఉడికించండి తరువాత నలిపిన కసూరి మేతిని గ్రేవీ లో వెయ్యండి. చివరకు క్రీం వేసి, బాగా కలపండి మరియు స్టవ్ ఆపివేయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర