ఆలూ టిక్కీ ఛాట్ | Aloo Tikki Chaat Recipe in Telugu

ద్వారా Pavani Nandula  |  24th Feb 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Aloo Tikki Chaat by Pavani Nandula at BetterButter
ఆలూ టిక్కీ ఛాట్by Pavani Nandula
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

4476

0

ఆలూ టిక్కీ ఛాట్ వంటకం

ఆలూ టిక్కీ ఛాట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo Tikki Chaat Recipe in Telugu )

 • బంగాళదుంప-2 మధ్యస్థ, ఉడికించి, తొక్కతీసి మరియు మెదిపినవి
 • బఠాణీలు - 1/2 కప్పు
 • నల్ల జీలకర్ర - 1/2 చెంచా
 • జీలకర్ర- 1 చెంచా
 • పచ్చి మిర్చి- 2-3, సన్నగా తరిగినవి
 • కొత్తిమీర- 2 పెద్ద చెంచా, సన్నగా తరిగింది
 • కార్న్ స్టార్చ్ - 1 పెద్ద చెంచా
 • ఉడికించిన శనగలు- 2 కప్పులు
 • ఉల్లిపాయ- 1 చిన్నది, సన్నగా తరిగింది
 • పచ్చి మిర్చి- 1-2, చీల్చినది
 • ధనియాల పొడి- 1 చెంచా
 • జీలకర్ర పొడి- 1 చెంచా
 • ఎర్ర కారం- 1 చెంచా (రుచికి తగినట్లుగా)
 • ఆమ్చూర్ పొడి- 1 చెంచా
 • గరం మసాలా- 1/2 చెంచా
 • టమోటా ప్యూరే- 2 పెద్ద చెంచా (లేదా 1 పండిన టమోటా)
 • ఉప్పు, మిరియాలు- రుచికి
 • సేవ్- వడ్డనకి
 • ఖర్జూర్- చింతపండు పచ్చడి- వద్దనకి
 • గ్రీన్ చట్నీ- వడ్డనకి
 • చిలికిన పెరుగు- వడ్డనకి
 • ఎర్ర ఉల్లిపాయ- అలంకరణ కోసం

ఆలూ టిక్కీ ఛాట్ | How to make Aloo Tikki Chaat Recipe in Telugu

 1. ఛోలే చేయడానికి: పెనంలో 2 చెంచాల నూనె వేయండి, ఉల్లిపాయలు వేయండి మరియు 2-3 నిమిషాల వరకు వేగేదాక అయ్యేదాకా వేయించండి. ధనియా పొడి, జీలకర్ర పొడి, కరం, ఆమ్చూర్ పొడి, గరం మసాలా, ఒక కప్పు నీళ్ళు వేయండి. బాగా కలిపి 1-2 నిమిషాలు ఉండనివ్వండి.
 2. తర్వాత టమోటా ప్యూరీ వేసి 2-3 నిమిషాలు ఉడకనివ్వండి, తరచుగా కలపండి.
 3. ఉడికించిన శనగలు, ఉప్పు, మిరియాల పొడి వేయండి; బాగా కలిపి 4-5 నిమిషాలు ఉడికించండి, ఈలోగా బంగాళదుంప మెదిపెదానితో శనగలు కొంచెం మెదపండి. వడ్డించే దాకా ప్రక్కన పెట్టండి.
 4. ఆలూ ప్యాటీలు చేయడానికి: ప్యాన్లో 2 చెంచాల నూనె వేడి చేయండి, నల్ల జీలకర్ర, జీలకర్ర వేసి, ఇవి చిటపట లాడటం మొదలయ్యాక, పచ్చి మిర్చి వేసి కొన్ని నిమిషాలు వేగనివ్వండి.
 5. కలిపే గిన్నెలో, చిదిమిన బంగాళదుంపలు, బఠాణీలు, కొత్తిమీర, కార్న్ స్టార్చ్, ఉప్పు అన్నీ కలిపి పోపు వేయండి. బాగా కలిపి మిశ్రమాన్ని 8 భాగాలుగా చేయండి. ప్రతి భాగాన్ని గుడ్రంగా చేసి కొంచెం చదును చేయండి.
 6. నాన్ స్టిక్ పెనం మీద కొంచం నూనె వేసి వేడి చేసి, టిక్కీలని రెండూ వైపులా లేత గోధుమ రంగు వచ్చే వరకు ఒక్కో వైపు 2-3 నిమిషాలు వండండి.
 7. వడ్డించడానికి: వడ్డన గిన్నెలో 2 టిక్కీలని ఉంచండి, దానిని కొంచెం చోలే, సేవ్, గ్రీన్ చట్నీ అమరియు చింతపండు చట్నీ పైన వేయండి. వెంటనే వడ్డించండి.

Reviews for Aloo Tikki Chaat Recipe in Telugu (0)