ముస్లిం మటన్ కూర | Muslim Mutton Curry Recipe in Telugu

ద్వారా Disha Khurana  |  13th Mar 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Muslim Mutton Curry by Disha Khurana at BetterButter
ముస్లిం మటన్ కూరby Disha Khurana
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  90

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2628

0

Video for key ingredients

  ముస్లిం మటన్ కూర

  ముస్లిం మటన్ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Muslim Mutton Curry Recipe in Telugu )

  • 750 గ్రాముల ఎముకతో మటన్
  • 400 గ్రాముల పెరుగు
  • 200 గ్రాముల టమోటాలు
  • 200 గ్రాముల ఉల్లిపాయలు
  • 3 పచ్చిమిర్చి
  • 2 పెద్ద చెంచాలు అల్లం-వెల్లులి ముద్ద
  • 2 నిమ్మకాయలు
  • 1.5-2 పెద్ద చెంచాలు కాశ్మీర్ ఎర్ర కారం పొడి
  • 1.5 చెంచా గరం మసాల పొడి
  • 1 చెంచా పసుపు
  • 5-6 మిరియాలు
  • 1-2 బిర్యానీ ఆకులు
  • 3-4 యాలకులు
  • 1 అంగుళం దాల్చిన చెక్క
  • 3-4 లవంగాలు
  • 5-6 పెద్ద చెంచాలు నెయ్యి
  • ఉప్పు రుచికి తగినంత
  • చేతి నిండా తరిగిన కొత్తిమీర
  • చేతి నిండా పుదీనా

  ముస్లిం మటన్ కూర | How to make Muslim Mutton Curry Recipe in Telugu

  1. మటన్ ని రెండు సార్లు బాగా కడిగి మిగిలిన నీటినంతా వడకట్టి దాన్ని ఊరపెట్టటానికి సిద్ధంగా ఉంచండి.
  2. ఉల్లిపాయల్ని సన్నగా తరిగి, కొంచం ఉప్పు పట్టించి ఒక 10 నిముషాలు అలా పక్కన ఉంచండి. 10 నిమిషాల తర్వాత, అధికంగా ఉండే నీటిని పిండేసి వాటిని బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించండి. ఒక అబ్జార్బెంట్ పేపర్ మీద ఉంచి తీసి పక్కన ఉంచుకోండి.
  3. టమాటాలను సన్నగా తరగండి; రెండు నిమ్మకాయల్ని రసం పిండి పక్కన ఉంచండి.
  4. పెరుగుని ఎటువంటి ఉంటలు లేకుండా చిలికి కారప్పొడి, పసుపు, గరం మసాలా మరియు ఉప్పుని కలిపి ఉంచండి. తరిగి ఉంచిన టమాటా, అల్లం వెల్లుల్లి మిశ్రమం, నిమ్మకాయ రసం మరియు వేయించిన ఉల్లిపాయ పొడి వేయండి. మసాల ని చూసుకోండి
  5. మటన్ ముక్కలని వేసి చేత్తో కాని గరిటతో కాని కలపండి. ఫ్రిజ్ లో ఒక రాత్రంతా ఊరటానికి ఉంచండి.
  6. మరుసటి రోజు పొద్దున, ఫ్రిజ్ నుంచి తీసి దాన్ని గది ఉష్ణోగ్రతకు తీసుకురండి.
  7. ఒక మందపాటి కడాయిని తీసుకుని దానిలో నెయ్యి వేసి మధ్యస్తంగా ఉన్న మంట మీద వేడి చేసి బిరియాని ఆకులు, మిరియాలు, చెక్క, లవంగా మరియు యాలకులను వేసి చిటపటలాడనివ్వాలి. ఊరి ఉన్న మటన్ ముక్కలని ఆ ఊటతో సహా బాండీలో వేసి ఉడికించండి.
  8. ఒకసారి అది ఉడికాక, దాన్ని తక్కువ మంట మీద మూసి 1 - 1.5 గంటలు మధ్యలో కలుపుతూ మటన్ బాగా మెత్తబడి ఎముకనుండి విడిపోయేదాకా ఉడికించండి.
  9. ఒకసారి మటన్ ఉడికి మెత్తగా అవ్వగానే మసాల రుచి చూడండి; తర్వాత తరిగిన కొత్తిమీర మరియు పుదీనాతో అలంకరించండి.
  10. ఖబూస్ తో కాని మెత్తని బటర్ పావ్తో లేదా కొంచం వేడి అన్నం ఇంకా ఉల్లిపాయ సలాడ్ తో వేడి వేడిగా వడ్డించండి.

  నా చిట్కా:

  తయారీని హడావిడిగా చేయకండి, నెమ్మదిగా చేసిన వంట ఈ వంటకి కూర యొక్క మాంసం ముద్దకి మంచి రుచిని ఇస్తుంది.

  Reviews for Muslim Mutton Curry Recipe in Telugu (0)

  Cooked it ? Share your Photo