BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ముస్లిం మటన్ కూర

Photo of Muslim Mutton Curry by Disha Khurana at BetterButter
107
451
0(0)
3

ముస్లిం మటన్ కూర

Mar-13-2016
Disha Khurana
30 నిమిషాలు
వండినది?
90 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముస్లిం మటన్ కూర రెసిపీ గురించి

ఈ మటన్ కూర సులభమైన ముక్కలు గల ణా శైలి మరియు ఎవరైనా ఇంట్లో చేసుకోగలిగే చాలా రుచికరమైన మటన్ కూర. నేను ఈ మటన్ రెసిపీ చేసిన ప్రతిసారీ, నేను ప్రశంసలతో మునిగిపోతాను. మీరు కూడా ఆస్వాదిస్తారని అనుకుంటున్నా! బెటర్ బటర్ నుండి గమనిక: మటన్ కూర బెంగాలు కు చెందిన భారతీయ వంటకం. భారతదేశం అంతటా భిన్న తయారీ పద్ధతుల ద్వారా ఇది భారతదేశం అంతటా చాలా ప్రసిద్ధి అయ్యింది. జమ్మూ కాశ్మీర్ నుండి రోహన్ జోష్ అనే ప్రసిద్ధ మటన్ కూర పధ్ధతి ఉంది. కోశాన్ మోంగ్షో బెంగాల్ శైలి మటన్ కూర ఉంది. వారి రుచిని ఇస్తూ ఈ మటన్ కూర రెసిపీ నిజానికి అనేక దేశాలలో అంతర్జాతీయంగా ప్రయాణించింది. మనం దిశా ఖురానా చేసిన ముస్లిమ్ మటన్ కూర గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఈ ముస్లిం మటన్ కూర పెరుగు మరియు నెయ్యి యొక్క రుచులతో ప్రత్యేకంగా చేయబడుతుంది. బెటర్ బటర్ ఈ మటన్ కూర కి పెద్ద థమ్స్ అప్ ఇస్తుంది!మటన్ కూర వికీపిడియా. మటన్ కూర తన్దూరే రోటితో ఆస్వాదించవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • మొఘలాయి
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. 750 గ్రాముల ఎముకతో మటన్
  2. 400 గ్రాముల పెరుగు
  3. 200 గ్రాముల టమోటాలు
  4. 200 గ్రాముల ఉల్లిపాయలు
  5. 3 పచ్చిమిర్చి
  6. 2 పెద్ద చెంచాలు అల్లం-వెల్లులి ముద్ద
  7. 2 నిమ్మకాయలు
  8. 1.5-2 పెద్ద చెంచాలు కాశ్మీర్ ఎర్ర కారం పొడి
  9. 1.5 చెంచా గరం మసాల పొడి
  10. 1 చెంచా పసుపు
  11. 5-6 మిరియాలు
  12. 1-2 బిర్యానీ ఆకులు
  13. 3-4 యాలకులు
  14. 1 అంగుళం దాల్చిన చెక్క
  15. 3-4 లవంగాలు
  16. 5-6 పెద్ద చెంచాలు నెయ్యి
  17. ఉప్పు రుచికి తగినంత
  18. చేతి నిండా తరిగిన కొత్తిమీర
  19. చేతి నిండా పుదీనా

సూచనలు

  1. మటన్ ని రెండు సార్లు బాగా కడిగి మిగిలిన నీటినంతా వడకట్టి దాన్ని ఊరపెట్టటానికి సిద్ధంగా ఉంచండి.
  2. ఉల్లిపాయల్ని సన్నగా తరిగి, కొంచం ఉప్పు పట్టించి ఒక 10 నిముషాలు అలా పక్కన ఉంచండి. 10 నిమిషాల తర్వాత, అధికంగా ఉండే నీటిని పిండేసి వాటిని బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించండి. ఒక అబ్జార్బెంట్ పేపర్ మీద ఉంచి తీసి పక్కన ఉంచుకోండి.
  3. టమాటాలను సన్నగా తరగండి; రెండు నిమ్మకాయల్ని రసం పిండి పక్కన ఉంచండి.
  4. పెరుగుని ఎటువంటి ఉంటలు లేకుండా చిలికి కారప్పొడి, పసుపు, గరం మసాలా మరియు ఉప్పుని కలిపి ఉంచండి. తరిగి ఉంచిన టమాటా, అల్లం వెల్లుల్లి మిశ్రమం, నిమ్మకాయ రసం మరియు వేయించిన ఉల్లిపాయ పొడి వేయండి. మసాల ని చూసుకోండి
  5. మటన్ ముక్కలని వేసి చేత్తో కాని గరిటతో కాని కలపండి. ఫ్రిజ్ లో ఒక రాత్రంతా ఊరటానికి ఉంచండి.
  6. మరుసటి రోజు పొద్దున, ఫ్రిజ్ నుంచి తీసి దాన్ని గది ఉష్ణోగ్రతకు తీసుకురండి.
  7. ఒక మందపాటి కడాయిని తీసుకుని దానిలో నెయ్యి వేసి మధ్యస్తంగా ఉన్న మంట మీద వేడి చేసి బిరియాని ఆకులు, మిరియాలు, చెక్క, లవంగా మరియు యాలకులను వేసి చిటపటలాడనివ్వాలి. ఊరి ఉన్న మటన్ ముక్కలని ఆ ఊటతో సహా బాండీలో వేసి ఉడికించండి.
  8. ఒకసారి అది ఉడికాక, దాన్ని తక్కువ మంట మీద మూసి 1 - 1.5 గంటలు మధ్యలో కలుపుతూ మటన్ బాగా మెత్తబడి ఎముకనుండి విడిపోయేదాకా ఉడికించండి.
  9. ఒకసారి మటన్ ఉడికి మెత్తగా అవ్వగానే మసాల రుచి చూడండి; తర్వాత తరిగిన కొత్తిమీర మరియు పుదీనాతో అలంకరించండి.
  10. ఖబూస్ తో కాని మెత్తని బటర్ పావ్తో లేదా కొంచం వేడి అన్నం ఇంకా ఉల్లిపాయ సలాడ్ తో వేడి వేడిగా వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర