రాగి మరియు జొన్న ఇడ్లి | Fingermillet and Sorghum Idli Recipe in Telugu

ద్వారా Abhinetri V  |  13th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Fingermillet and Sorghum Idli recipe in Telugu,రాగి మరియు జొన్న ఇడ్లి, Abhinetri V
రాగి మరియు జొన్న ఇడ్లిby Abhinetri V
 • తయారీకి సమయం

  6

  గంటలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

రాగి మరియు జొన్న ఇడ్లి వంటకం

రాగి మరియు జొన్న ఇడ్లి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fingermillet and Sorghum Idli Recipe in Telugu )

 • రాగులు - 1 కప్
 • జొన్నలు- 1/2 కప్
 • మినప్పప్పు - 1 కప్
 • ఇడ్లి రవ్వ - 2 కప్స్
 • ఉప్పు- రుచికి సరిపడ
 • నీరు - తగినంత
 • నెయ్య/ నూనె - 1 చెంచా

రాగి మరియు జొన్న ఇడ్లి | How to make Fingermillet and Sorghum Idli Recipe in Telugu

 1. ముందుగా రాగులని మరియు జొన్నలని 6 గంటల సేపు మంచినీటిలో నానబెట్టాలి. అలాగే మినపప్పు ని 4 గంటలు మంచినీటిలో నానబెట్టాలి.
 2. ఇప్పుడు గ్రైండర్ లో వీటిని 20 నుండి 30 నిమిషాలు దాకా కావాల్సినంత నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో తగినంత ఉప్పు మరియు ఇడ్లి రవ్వ వేసి బాగా కలపాలి.
 3. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా విభజించాలి. ఒక భాగాన్ని ఫ్రిజ్ లో పెట్టి, రెండో భాగాన్ని మాత్రం పులవడానికి బయట పెట్టి ఫర్మెంట్ చెయ్యాలి.
 4. ఇడ్లిలు చేసే సమయం లో రెండు మిశ్రమాలని కలిపి , ఇడ్లి ట్రే కి తగినంత నెయ్య రాసి పిండి ని చక్కగా ట్రే లో సరిపడినంత వేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మరియు 5 నిమిషాలు సిం లో ఉడకనివ్వాలి.
 5. ఎంతో రుచికరమైన రాగి మరియు జొన్న ఇడ్లిలు కొబ్బరి లేదా అల్లం పచ్చడి తో సర్వ్ చెయ్యండి.

నా చిట్కా:

రాగులు మరియు జొన్నలు తో తయారైన ఇడ్లిలు మనకి ఎంతో మేలు చేస్తయి.

Reviews for Fingermillet and Sorghum Idli Recipe in Telugu (0)