హోమ్ / వంటకాలు / రాగి మరియు జొన్న ఇడ్లి

Photo of Fingermillet and Sorghum Idli by Abhinetri V at BetterButter
0
6
0(0)
0

రాగి మరియు జొన్న ఇడ్లి

Mar-13-2018
Abhinetri V
360 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి మరియు జొన్న ఇడ్లి రెసిపీ గురించి

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేందుకు రాగి మరియు జొన్న తో తయారైన ఇడ్లి. ఈ ఇడ్లిలని మనం కొబ్బరి పచ్చడి తో గాని లేక అల్లం పచ్చడి తో గాని అల్పాహారం లో తీసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రాగులు - 1 కప్
  2. జొన్నలు- 1/2 కప్
  3. మినప్పప్పు - 1 కప్
  4. ఇడ్లి రవ్వ - 2 కప్స్
  5. ఉప్పు- రుచికి సరిపడ
  6. నీరు - తగినంత
  7. నెయ్య/ నూనె - 1 చెంచా

సూచనలు

  1. ముందుగా రాగులని మరియు జొన్నలని 6 గంటల సేపు మంచినీటిలో నానబెట్టాలి. అలాగే మినపప్పు ని 4 గంటలు మంచినీటిలో నానబెట్టాలి.
  2. ఇప్పుడు గ్రైండర్ లో వీటిని 20 నుండి 30 నిమిషాలు దాకా కావాల్సినంత నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో తగినంత ఉప్పు మరియు ఇడ్లి రవ్వ వేసి బాగా కలపాలి.
  3. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా విభజించాలి. ఒక భాగాన్ని ఫ్రిజ్ లో పెట్టి, రెండో భాగాన్ని మాత్రం పులవడానికి బయట పెట్టి ఫర్మెంట్ చెయ్యాలి.
  4. ఇడ్లిలు చేసే సమయం లో రెండు మిశ్రమాలని కలిపి , ఇడ్లి ట్రే కి తగినంత నెయ్య రాసి పిండి ని చక్కగా ట్రే లో సరిపడినంత వేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మరియు 5 నిమిషాలు సిం లో ఉడకనివ్వాలి.
  5. ఎంతో రుచికరమైన రాగి మరియు జొన్న ఇడ్లిలు కొబ్బరి లేదా అల్లం పచ్చడి తో సర్వ్ చెయ్యండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర