సొరకాయ దిబ్బరొట్టి . | Bottle gourd rotti Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  14th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bottle gourd rotti recipe in Telugu,సొరకాయ దిబ్బరొట్టి ., Sree Vaishnavi
సొరకాయ దిబ్బరొట్టి .by Sree Vaishnavi
 • తయారీకి సమయం

  90

  నిమిషాలు
 • వండటానికి సమయం

  60

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

సొరకాయ దిబ్బరొట్టి . వంటకం

సొరకాయ దిబ్బరొట్టి . తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bottle gourd rotti Recipe in Telugu )

 • సోరకాయ తురుము 2 కప్పులు
 • మిన పప్పు 1 కప్పు
 • ఇడ్లిరవ్వ 2 కప్పులు
 • పచ్చిమిర్చి 3
 • ఉప్పు రుచికి సరిపడినంత
 • జీలకర్ర 1 చెంచాడు
 • నువ్వుపప్పు 2 చెంచాలు
 • ఇంగువ 1 చిటికెడు
 • నూనె 1చెంచాడు

సొరకాయ దిబ్బరొట్టి . | How to make Bottle gourd rotti Recipe in Telugu

 1. ముందుగా మినపప్పుని 4 గంటల పాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి
 2. రుబ్బిన పిండిలో ఇడ్లీ రవ్వ కలిపి 8గంటలు పాటు పులియ బెట్టాలి .
 3. తరువాత పిండిలో సొరకాయ తురుము పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు జీలకర్ర , ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి .
 4. ఒక బాండీ లో నూనె వేసి నువ్వుపప్పు వేసి ముందుగా తయారు చేసుకున్న పిండిని వేసి చిన్న మంటలో కాల్చుకోవాలి .
 5. 20 నిమిషముల పాటు సన్నీ సెగ మీద నెమ్మదిగా కాల్చుకోవాలి రెండువైపులా దోర గా కాల్చుకుని వడ్డించండి. తినటానికి ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన సొరకాయ దిబ్బరొట్టి రెడీ .

నా చిట్కా:

నెమ్మదిగా చిన్న మంటలో కాల్చుకోవాలి తరువాత కావాలంటే పిండి లో వంటసోడా వేసుకోవచ్చు ఇంకా మెత్తగా రావటానికి.

Reviews for Bottle gourd rotti Recipe in Telugu (0)