ఉల్లి గారెలు | Ulli garelu Recipe in Telugu

ద్వారా Abhinetri V  |  14th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Ulli garelu recipe in Telugu,ఉల్లి గారెలు, Abhinetri V
ఉల్లి గారెలుby Abhinetri V
 • తయారీకి సమయం

  5

  గంటలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

3

0

ఉల్లి గారెలు వంటకం

ఉల్లి గారెలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ulli garelu Recipe in Telugu )

 • మినప్పప్పు- 2 కప్పులు
 • ఉప్పు- తగినంత
 • సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు - 1 కప్
 • నూనె- వేయించడానికి సరిపడ
 • సన్నగా తరిగిన పచ్చిమిర్చి- 1 చెంచా
 • తరిగిన అల్లం - 1 చెంచా

ఉల్లి గారెలు | How to make Ulli garelu Recipe in Telugu

 1. ముందుగా మినప్పప్పు ని 5 గంటలు పాటు మంచి నీటి లో నానపెట్టండి.
 2. తరువాత నీరు ని కాస్త వడగట్టి ,మిక్సీలో మెత్తగా రుబ్బి గరేలకి సరిపడే పిండి/ముద్ద తయారు చేయండి.
 3. ఇందులో రుచికి సరిపడ ఉప్పు, తరిగిన ఉల్లి,పచ్చిమిర్చి,అల్లం ముక్కలను వేసి చక్కగా మిశ్రమాన్ని సిద్ధం చేసుకోండి.
 4. ఒక బాణలిలో నూనె పోసి, అందులో ముందుగా చేసిన మిశ్రమాన్ని వడ/గారెలు రూపం లో తయ్యారు చేసి , సన్నని సెగ పైన రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు లేదా దోరగా వేగనివ్వండి.
 5. దోరగా వేయించిన గారెలని పేపర్ పరిచిన ప్లేటులోకి తీసుకోండి. కరకరలాడే ఉల్లి గారెలు రెడి.. వీటిని అల్లం లేదా కొబ్బరి పచ్చడి తో వడ్డించుకోండి.

Reviews for Ulli garelu Recipe in Telugu (0)