బొంబాయి రవ్వ ఉప్మా | Bombai ravva upma Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  20th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bombai ravva upma recipe in Telugu,బొంబాయి రవ్వ ఉప్మా, Tejaswi Yalamanchi
బొంబాయి రవ్వ ఉప్మాby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

3

0

బొంబాయి రవ్వ ఉప్మా వంటకం

బొంబాయి రవ్వ ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bombai ravva upma Recipe in Telugu )

 • బొంబాయి రవ్వ : 2 కప్పులు
 • ఉల్లిపాయ : 1
 • పచ్చి మిరపకాయ : 1
 • ఆవాలు : 1/2 టీస్పూన్
 • అల్లం : అంగుళం ముక్క
 • పచ్చి పప్పు / మినా పప్పు : 1 టీస్పూన్
 • కారెట్ : 1/2 కప్పు
 • ఉప్పు రుచికి సరిపడ
 • నీళ్లు : 4 కప్పులు
 • నూనె తగినంత

బొంబాయి రవ్వ ఉప్మా | How to make Bombai ravva upma Recipe in Telugu

 1. ముందుగా ఒక పాన్ లో నూనె వేసి వేడి చేసుకోండి ఆ పైన ఆవాలు ,పచ్చి పప్పు వేసి ఆవాలు చితపటలాడి , పప్పు రంగు మారే వరకు వేయించండి.
 2. తరవాత ఉల్లిపాయ ముక్కలు,అల్లం ముక్కలు, పచ్చి మిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి కాస్త వేయించండి.
 3. ఇపుడు 2 కప్పుల రవ్వకి కి 4 కప్పుల నీళ్లు పోసుకోండి.
 4. నీళ్లు బాగా మరిగాక ఉప్పు వేసుకోండి.
 5. ఇపుడు మంటను తగ్గించి, రవ్వ వేస్తూ ఉండలు లేకుండా కలుపు కొండి.
 6. నీరు ఇంకిన తరువాత కాస్త నెయ్యి వేసి కలుపుకోండి. దీనితో ఉప్మా రుచి రేటింపు అవుతుంది.
 7. త్వరగా చేసుకునే రుచికరమైన మరియు సాంప్రదాయిక బొంబాయి రవ్వ ఉప్మా తాయర్. మీరు కూడా చేసుకొని ఆనందించండి.

నా చిట్కా:

నేను క్యారెట్ వేసాను మీకు కవలంటే టమోటా,బీన్స్ ఇంకా ఏవైనా ఇష్టమైన కోరలు తరిగి వేసుకోవచ్చును. ఆ రంగు రంగుల కూరలు పిల్లలను ఎంతో ఆకర్షిస్తాయి.

Reviews for Bombai ravva upma Recipe in Telugu (0)