పెరుగు వడ | Curd vada Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  21st Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Curd vada by Tejaswi Yalamanchi at BetterButter
పెరుగు వడby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

పెరుగు వడ వంటకం

పెరుగు వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curd vada Recipe in Telugu )

 • మినప్పప్పు : 2 కప్పులు
 • ఉప్పు : రుచికి సరిపడ
 • పెరుగు : 3 కప్పులు
 • ఆవాలు : 1 టీస్పూను
 • జీలకర్ర : 1టీస్పూను
 • పెసరపప్పు
 • కర్వేపాకు : 2 రెమ్మలు
 • నూనె వేయించడానికి సరిపడ
 • నీళ్లు : 2 కప్పులు

పెరుగు వడ | How to make Curd vada Recipe in Telugu

 1. ముందురోజు రాత్రి మినపప్పు ని బాగా శుభ్రం చేసుకొని సరిపడినన్ని నీళ్లు పోసి నానా పెట్టుకోండి .
 2. మరుసటి రోజు ఉదయం నానపెట్టిన పప్పు ని బరకగా రుబ్బుకోండి
 3. రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి
 4. ఒక బాణీలో వేయించడానికి నూనె పోసుకొని వేడి చేసుకోండి. కలిపి ఉంచుకున్న పిండి తో గారెలు చేసుకొని దోరగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోండి ఆ పైన ఒక పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకొని నూనె ఇంక నివ్వండి
 5. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో వేయించిన గారెలు వేసి పది నిమిషముల తరువాత రెండు అరి చేతులతో వత్తి నీళ్లు పిండేసి ఇంకొకగిన్నెలొకి తీసుకోండి
 6. ఇప్పుడు మరొక గిన్నె లోకి పెరుగు మరియు నీళ్లు తీసుకొని మజ్జిగల చిలకండి ఆ పైన రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలపండి
 7. ఒక పాన్ లో ఒక చెంచాడు నూనె వేసి ఆవాలు జీలకర్ర మరియు కరివేపాకు తో తాలింపు చేసుకొని తయారు ఉంచుకున్న మజ్జిగ లో వేసి కలుపుకోండి
 8. నీరు పిండి ఉంచుకున్న గారెల పై మజ్జిగ పోసి ఒక ఘంట పాటు నన నివ్వండి ఆ తర్వాత సేవించి ఆందడించండి మరియు ఇతరులతో పంచుకొని సంతృప్తిచెందండి.
 9. ఎంతో రుచికరమైన పెరుగు వడ రెడీ

Reviews for Curd vada Recipe in Telugu (0)